Panneerselvam: పన్నీర్ సెల్వం బీజేపీతో బంధం తెంచుకున్నట్టు అధికారిక ప్రకటన.. కారణం ఇదే!

Panneerselvam

Panneerselvam: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం నేతృత్వంలోని అన్నాడీఎంకే క్యాడర్ హక్కుల పునరుద్ధరణ కమిటీ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) నుంచి వైదొలిగినట్లు గురువారం ప్రకటించింది.

Panneerselvam: ఈ నిర్ణయాన్ని కమిటీ సలహాదారు పన్రుతి ఎస్. రామచంద్రన్ మీడియాకు తెలియజేశారు. పన్నీర్ సెల్వం, ఇతర నేతలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “ఇకపై మా కమిటీ NDAలో భాగం కాదు” అని తేల్చిచెప్పారు.

అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?

Panneerselvam: 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పన్నీర్ సెల్వం ముందుగానే రాజకీయ వ్యూహాన్ని రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో మమేకం కావాలన్న ఉద్దేశంతో ఆయన తమిళనాడులో పర్యటన చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాజకీయంగా పెరుగుతున్న ఒత్తిడిలో భాగంగా, ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని అధికారిక అన్నాడీఎంకే బీజేపీతో కలిసిపోవడంతో పన్నీర్ సెల్వం వర్గం NDAతో అవినాభావంగా కొనసాగలేమని భావించింది.

NDAపై కోపమా? రాజకీయ అవసరమా?

Panneerselvam: ఈ సమావేశంలో రామచంద్రన్ మాట్లాడుతూ, “ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మేము NDA నుంచి తప్పుకుంటున్నాం. దేశం మొత్తం ఈ నిర్ణయం వెనకున్న కారణాన్ని త్వరలో తెలుసుకుంటుంది,” అని అన్నారు. ప్రస్తుతం వారు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా స్వతంత్రంగా రాజకీయంగా ముందుకు వెళ్లనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే కొత్త పొత్తులపై ఆలోచించనున్నట్లు తెలిపారు.

పన్నీర్ సెల్వం – స్టాలిన్ భేటీపై ఉత్కంఠ

Panneerselvam: అయితే ఈ నిర్ణయం వెలువడే సమయంలో పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌తో మార్నింగ్ వాక్ చేసిన విషయమూ చర్చనీయాంశమైంది. బహుశా అప్పుడే కీలకమైన చర్చలు జరిగి ఉంటాయని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వెలువడుతున్నాయి. సీఎంతో భేటీ అనంతరం NDA నుంచి వైదొలగినట్టు ప్రకటించడం సంచలనంగా మారింది.

పళనిస్వామి-పన్నీర్ సెల్వం విభేదాల పునరుద్ఘాటన

Panneerselvam: ఇప్పటికే అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామికి వ్యతిరేకంగా పన్నీర్ సెల్వం వర్గం పార్టీని తిరిగి కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో NDA కూటమిలో కొనసాగడం వీలుకాదని OPS గ్రూప్ భావించింది. ప్రజల మద్దతు, వాలంటీర్ల శక్తితో తిరిగి పార్టీపై ఆధిపత్యం సాధించేందుకు బీజేపీ బంధాన్ని తెంచుకునే దిశగా పయనించింది.

తమిళనాడు రాజకీయాల్లో ఈ పరిణామం చాలా కీలకమైనది. పన్నీర్ సెల్వం నిర్ణయం తామాషాగా కాకుండా, భవిష్యత్తులో తమిళ రాజకీయాల్లో నూతన కూటముల ఏర్పాటుకు బీజం కావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. NDA నుంచి వైదొలిగినా, భవిష్యత్ రాజకీయాల్లో పన్నీర్ సెల్వం ఏవిధంగా వ్యవహరిస్తారు అనేది ఆసక్తికర అంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *