Kiran Abbavaram: టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం జీవితంలో ఓ సంతోషకర ఘట్టం చోటు చేసుకుంది. ఇటీవలే ఆయన భార్య రహస్య గోరఖ్కు పండంటి కుమారుడు జన్మించాడు. ఇప్పుడు తొలిసారి తన కొడుకు ఫోటోను, పేరును ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా నామకరణ మహోత్సవాన్ని కుటుంబసభ్యుల మధ్య హర్షోల్లాసంగా జరిపారు.
‘హను అబ్బవరం’ అని పేరు పెట్టిన కిరణ్
Kiran Abbavaram: తన కుమారుడికి ‘హను అబ్బవరం’ అనే పేరును కిరణ్ అబ్బవరం పెట్టారు. చిన్నారి పంచకట్టులో,పై నామాలతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఫొటోను ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశాడు. ఫోటో చూస్తే ముద్దుగా, క్యూట్ గా ఉన్న బాబు మరిచిపోలేని ముచ్చటగా కనిపిస్తున్నాడు.
ఇది కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్లో కసాయి భర్త దారుణం.. ప్రియురాలికోసం భార్య, పిల్లల్ని!
ఫోటోకు అభిమానుల స్పందన హీట్
Kiran Abbavaram: ఈ పిక్ చూసిన అభిమానులు స్పందనతో సోషల్ మీడియాలో కామెంట్లు, లైకుల వర్షం కురిపిస్తున్నారు. ‘‘అబ్బా ఎంత క్యూట్ గా ఉన్నాడు.. దేవుడు ఆశీర్వదించాలి.. కుటుంబానికి శుభాకాంక్షలు’’ వంటి కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. తొలిసారి తన కొడుకు ముఖాన్ని రివీల్ చేసిన కిరణ్ పట్ల అభిమానులు ప్రత్యేక ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పర్సనల్ లైఫ్లో కిరణ్ కొత్త చాప్టర్
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం కెరీర్ పరంగా కొత్త సినిమాలతో బిజీగా ఉంటూనే, వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. ‘హను అబ్బవరం’ ఆ కుటుంబానికి ఆనందాన్ని తీసుకొచ్చాడు. కొత్తగా తండ్రిగా మారిన కిరణ్కు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
View this post on Instagram
ఈ ఫోటోతో పాటు హను అబ్బవరం పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కొత్తగా తండ్రిగా మారిన కిరణ్కి శుభాకాంక్షలు చెబుతూ నెటిజెన్లు హృదయపూర్వకంగా స్పందిస్తున్నారు.
