Indipendence Day 2025: ఈరోజు ఆగస్టు 15న దేశం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12వ సారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ముందుగా ప్రధాని మోదీ రాజ్ఘాట్ చేరుకుని మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత ఎర్రకోటకు వెళతారు. అక్కడ త్రివిధ దళాల సైనికులు ఆయనకు గౌరవ వందనం సమర్పిస్తారు. ఆ తర్వాత ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగిస్తారు.
తన ప్రసంగం ద్వారా, ప్రధానమంత్రి భారతదేశ దార్శనికతను అంతర్జాతీయ సమాజానికి తెలియజేస్తారు. అలాగే, మొత్తం ప్రసంగం మన సైన్య పరాక్రమానికి అంకితం అవుతుంది. ఈసారి పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని ప్రసంగ ఇతివృత్తం ‘నవ భారతదేశం’.
Indipendence Day 2025: ఈ సంవత్సరం, మొదటిసారిగా, 11 మంది అగ్నివీరులు జాతీయ గీతాన్ని వాయించే బ్యాండ్లో పాల్గొంటారు. అలాగే, ఆహ్వాన పత్రంలో ఆపరేషన్ సిందూర్ లోగో, చీనాబ్ బ్రిడ్జ్ వాటర్మార్క్ ఉన్నాయి.
Also Read: కూలీ మూవీతో సునామీ.. ఓవర్సీస్ ట్విట్టర్ లో ఇదే ముచ్చట!
ఎర్రకోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల మినిట్-టు-మినిట్ కార్యక్రమ వివరాలు
ఉదయం 7:30 గంటలకు: ప్రధాని మోదీ ఎర్రకోటకు చేరుకుంటారు.
ఉదయం 7:35 గంటలకు: జాతీయ జెండాను ఎగురవేస్తారు.
ఉదయం 7:37 గంటలకు: జాతీయ వందనం-జాతీయ గీతం.
ఉదయం 7:40 గంటలకు: పుష్ప వర్ష – రెండు ఎంఐ-17 హెలికాప్టర్లు ప్రజలపై పూల వర్షం కురిపిస్తాయి. ఒక హెలికాప్టర్ త్రివర్ణ పతాకాన్ని మోసుకెళ్లి ఎగురుతుంది. మరొకటి ఆపరేషన్ సిందూర్ జెండాను మోస్తుంది.
ఉదయం 7:45 గంటలకు: ఎర్రకోట నుండి ప్రధాని ప్రసంగం.
ఉదయం 8:15 గంటలకు: జాతీయ గీతం.
