Mini Taj Mahal: భార్యపై ఉన్న అపారమైన ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి ఒక భర్త ఏకంగా మరో తాజ్ మహల్ను కట్టించాడు. మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తి తన ఇంటిని తాజ్ మహల్ మాదిరిగా నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బయట నుండి చూస్తే నిజమైన తాజ్ మహల్ అనిపించేలా ఈ ఇల్లు ఉంది.
Mini Taj Mahal: ఈ మినీ తాజ్ మహల్లో నాలుగు బెడ్రూమ్లు, హాలు, వంటగది (4BHK) ఉన్నాయి. లోపలి అలంకరణ రాజభవనాన్ని తలపించేలా అద్భుతంగా ఉంది. సోఫాలు, లైటింగ్, డిజైన్, పాలరాయి పనితనం అన్నీ అత్యంత శ్రద్ధతో తయారు చేయబడ్డాయి. అసలు తాజ్ మహల్ నిర్మాణంలో వాడిన మక్రానా పాలరాయినే ఈ ఇంటికి ఉపయోగించారని యజమాని తెలిపారు.
ఇంటి యజమాని మాట్లాడుతూ – “నా భార్యపై ప్రేమకే ఈ మినీ తాజ్ మహల్ నిర్మాణం. అసలు తాజ్ మహల్ మీటర్ల కొలతలలో ఉంటే, వాటిని అడుగుల కొలతలలో అనుసరించి ఇల్లు కట్టించాను” అని చెప్పారు.
ఇంటి లోపల ప్రతి మూలకూ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. లివింగ్ రూమ్లో విలాసవంతమైన పెద్ద సోఫాలు, మెట్లపై అందమైన డిజైన్లు, గోడలపై ఆకర్షణీయమైన పెయింటింగ్స్, ప్రవేశ ద్వారం వద్ద ఆవు బొమ్మ – ప్రతి అంశం ప్రత్యేకతను చూపిస్తోంది. యజమాని తన బాల్యంలో ఆవులకు పాలు పంచిన జ్ఞాపకంగా ఆవు చిత్రాన్ని చేయించుకున్నట్లు తెలిపారు.
View this post on Instagram
అంతేకాదు, ఈ అద్భుతమైన నిర్మాణం ఒక పాఠశాల ప్రాంగణంలో భాగంగా ఉంది. ఎందుకంటే ఇంటి యజమాని స్వయంగా పాఠశాలను నడుపుతున్నారు. దీంతో విద్యార్థులు కూడా ఈ మినీ తాజ్ మహల్ అందాలను చూసి ఆశ్చర్యపోతున్నారు.
