Dasara Holidays: దసరా సెలవుల లిస్ట్ వచ్చేసింది..విద్యార్థులు ఫుల్ కుష్!

School Holidays

Dasara Holidays: దసరా పండుగ అంటేనే ఆనందం, సందడి. దుర్మార్గంపై ధర్మం గెలిచిన రోజు అని చెప్పుకునే ఈ వేళలో వచ్చే సెలవులు కుటుంబ సభ్యులు, బంధువులతో గడిపితేనే పండుగకు అసలైన రుచినిస్తుంది. ఇక ఈసారి తెలంగాణలో విద్యార్థులకు మంచి వార్త అందింది. దసరా పండుగ సందర్భంగా భారీ సెలవులు ప్రకటించారు.

Dasara Holidays: విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయి. అంటే మొత్తం 13 రోజుల పాటు విద్యార్థులు హాలిడే మూడ్‌లో ఉండొచ్చు. తిరిగి పాఠశాలలు అక్టోబర్ 4న పునఃప్రారంభం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఇదే ఫైనల్‌గా ఉన్నప్పటికీ, అవసరమైతే మార్పులు ఉంటే తెలియజేస్తామని అధికారులు తెలిపారు.

ఈ సెలవుల మధ్యలోనే అక్టోబర్ 2న గాంధీ జయంతి ఉండటం విశేషం. ఇది సాధారణంగా ప్రభుత్వ సెలవు అయినప్పటికీ, ఈసారి దసరా బ్రేక్‌లోనే కలిసిపోయింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ముందుగానే ట్రిప్స్, టూర్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ సెలవుల్లో బతుకమ్మ ఉత్సవాలు, బొమ్మల కొలువులు, ఊరేగింపులు మొదలుకొని నగరాల్లో పండగ సందడి కట్టిపడేస్తుంది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. అక్కడ దసరా సెలవులు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు అంటే 9 రోజులు ఇచ్చారు. క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలల్లో సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 2 వరకు కేవలం 6 రోజులు మాత్రమే సెలవులు ఉంటాయి. జూనియర్ కాలేజీల విషయానికి వస్తే సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు 8 రోజుల బ్రేక్ లభిస్తుంది.

మొత్తానికి ఈసారి తెలంగాణ విద్యార్థులు దసరా సందర్భంగా పెద్ద హాలిడే గిఫ్ట్ అందుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *