Onam Sadya: తొలిసారి ఓనమ్‌ సాధ్య విందు రుచి చూసిన ఫ్రెంచ్‌ మహిళ..ఏం చెప్పిందంటే!

Onam Sadya: ఓనమ్ అనేది దక్షిణాది రాష్ట్రమైన కేరళలో ఆనందం, భక్తితో జరుపుకునే సాంప్రదాయ భారతీయ పండుగ. ఢిల్లీలో జరిగిన సాంప్రదాయ ఓనం సాధ్యకు తొలిసారి హాజరైన ఓ ఫ్రెంచ్‌ మహిళ తన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఆమె చేసిన ట్వీట్ వైరల్‌గా మారి, భారతీయుల నుండి విపరీతమైన స్పందనలను పొందింది. ఈ పోస్ట్ 79,500 కంటే ఎక్కువ వ్యూస్ సాధించింది.

Onam Sadya: ఓనమ్ పండుగలో ప్రధాన ఆకర్షణ అరటి ఆకుపై వడ్డించే గొప్ప శాఖాహార విందు “సాధ్య”. ఇందులో క్రిస్పీ అరటిపండు చిప్స్, టాంజీ ఇంజి పులి, కొబ్బరితో చేసిన అవియల్, సువాసన గల సాంబార్, మెత్తటి మట్ట బియ్యం, క్రీమీ పాయసం వరకు దాదాపు 26 రకాల వంటకాలు ఉంటాయి. మతాలకు అతీతంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు.

ఇది కూడా చదవండి: Balagurusamy: మాస్టారు గొప్ప మనసు..! పనివారికి డబుల్ బెడ్‌రూం ఇండ్లు!

వైరల్‌ వీడియో ప్రకారం, రెండు సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చిన ఫ్రెంచ్ యువతి జూలియా చైగ్నో, తొలిసారి ఢిల్లీలో జరిగిన ఓనమ్ సాధ్య విందులో పాల్గొన్నారు. ఆమె కొత్తగా, విభిన్న రుచులతో కూడిన ఈ విందును అద్భుతంగా అభివర్ణించారు. భోజనం ఆస్వాదిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “నా జీవితంలో 20 సంవత్సరాలు భారతీయ ఆహారం లేకుండా నేను ఎలా జీవించానో నాకు తెలియదు!” అని క్యాప్షన్ రాశారు.

జూలియా తన అనుభవాన్ని చెబుతూ, “ఈరోజు తొలిసారి ఓనమ్ సాధ్యకు వెళ్ళాను. ఇది కొత్తగా, విభిన్న రుచులతో అద్భుతంగా ఉంది. చాలా ఎక్కువగా తిన్నాను.. ఇప్పుడు సంతోషంగా ప్రశాంతంగా నిద్రపోవచ్చు” అని రాసింది.

ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ పొందింది. భారతీయులు ఆమె భారతీయ సంస్కృతిపై చూపిన ఇష్టాన్ని ప్రశంసిస్తూ, విస్తృతంగా స్పందించారు. దీంతో జూలియా అనుభవం కాసేపట్లోనే వైరల్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *