CM Revanth Reddy: బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ భేటీ.. ఏం జరగబోతోంది..?

CM Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ పెరిగింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టు తాజా సూచనలు, స్పీకర్ నోటీసులు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది.

CM Revanth Reddy: ఒక్కరు కడియం శ్రీహరి మినహా.. మిగిలిన తొమ్మిది మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ను కలిశారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి హాజరైనట్లు సమాచారం. ప్రధానంగా సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్ నోటీసులపై వ్యూహం చర్చించినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Telangana: రోడ్డుపై దొరికిన రూ.16 లక్షల బంగారం, నగదు.. నిజాయతీగా తిరిగిచ్చిన ఆటోడ్రైవర్

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నేతలు అనర్హత వేటు వేయాలని కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు, మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆయా ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు.

ఈ నోటీసులకు స్పందిస్తూ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకే చెందినవాడినని చెప్పారు. “నేను కేసీఆర్‌ను గౌరవించే వ్యక్తిని, ఎప్పుడూ పార్టీ లైన్‌ దాటలేదు” అంటూ స్పష్టంచేశారు.

మిగిలిన ఎమ్మెల్యేలు మాత్రం సీఎం రేవంత్‌ను కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. పార్టీ ఫిరాయింపుల అంశంలో రేవంత్ ఏ వ్యూహం రచించబోతున్నారు..? అనర్హత కేసుల్లో ఏ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి..? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *