Telangana: గణేశ్ లడ్డూ వేలంలో ముస్లిం మహిళ విజయం.. మత సామరస్యం వెల్లివిరిసిన నిర్మల్

Telangana: తెలంగాణలో మత సామరస్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. గణేశ్ నిమజ్జనం సందర్భంగా జరిగిన లడ్డూ వేలంలో ముస్లిం మహిళ పాల్గొని విజేతగా నిలిచిన ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది.

Telangana: నిర్మల్ జిల్లాలో జరిగిన గణేష్ మండపం లడ్డూ వేలంలో అం‍రీన్ అనే ముస్లిం మహిళ రూ. 1,88,888కి లడ్డూను దక్కించుకున్నారు. ఇది స్థానికంగా మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గణేశ్ భక్తితో పాల్గొని లడ్డూను గెలుచుకోవడం మత సామరస్యానికి చక్కని ఉదాహరణగా నిలిచింది.

గతేడాది కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భాట్‌పల్లిలో కూడా ఇలాంటిదే జరిగింది. అక్కడ అఫ్జల్–ముస్కాన్ జంట రూ. 13,126కి గణేశ్ లడ్డూను గెలుచుకున్నారు. ఈ సంఘటనలు తెలంగాణలో గల సామరస్య వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Khairatabad Ganesh Immersion: భక్తుల కోలాహలం మధ్య ముగిసిన ఖైరతాబాద్ మహా గణపతి నిమర్జనం!

ఈ ఏడాది గణపతి లడ్డూలు పలు చోట్ల రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి.

  • హైదరాబాద్ కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో 10 కిలోల లడ్డూ కోసం 80 మంది పోటీ పడి, చివరకు ₹2.32 కోట్లు ధరకు అమ్ముడైంది. 
  • బాలాపూర్‌లో స్థానికుడు లింగాల దశరథ్ గౌడ్ రూ. 35 లక్షలకు లడ్డూను గెలుచుకున్నారు. 
  • రాయదుర్గం మైహోం భుజ అపార్ట్‌మెంట్స్‌లో లడ్డూ రూ. 51.07 లక్షలకు అమ్ముడైంది. 
  • హైదరాబాద్ కొత్తపేటలో వినూత్నంగా లక్కీ డ్రా పద్ధతిలో 333 కిలోల లడ్డూను ఒక బీబీఏ విద్యార్థి రూ. 99కే గెలుచుకోవడం విశేషం. 

ముస్లిం మహిళలు గణేశ్ లడ్డూ వేలాల్లో పాల్గొని గెలవడం కేవలం ఒక ఆచారం కాదు, సామాజిక సామరస్యానికి చిహ్నం. ఈ సంఘటనలు తెలంగాణలోని ప్రత్యేక సాంస్కృతిక వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *