MS Dhoni: వింటేజ్ రోల్స్ రాయిస్‌లో ధోనీ షికారు.. కారు వెనక పరుగులు తీసిన అభిమానులు.. వీడియో వైరల్!

MS Dhoni: భారత మాజీ క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి ఆయన ఆటతో కాదు, తన అద్భుతమైన కార్ల కలెక్షన్ కారణంగా. ఇటీవల ధోనీ జార్ఖండ్ రాజధాని రాంచీ వీధుల్లో తన వింటేజ్ రోల్స్ రాయిస్ కారును డ్రైవ్ చేస్తూ కనిపించారు. ఈ అరుదైన కారును ఆయన తన ఫామ్‌హౌస్ నుంచి బయటకు తీసిన వెంటనే అభిమానుల చూపులన్నీ దానిపైనే ఆగిపోయాయి.

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ అభిమానులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ నుంచి రిటైర్ అయినా కూడా ఆయన ఫ్యాన్స్ ఎప్పుడూ ఆయన చుట్టూనే ఉంటారు. తాజాగా, ధోనీ రాంచీలోని తన ఫామ్‌హౌస్ నుంచి అరుదైన రోల్స్ రాయిస్ సిల్వర్ వ్రైత్ II కారులో బయటకు వచ్చారు. 1980ల నాటి ఈ వింటేజ్ కారు చాలా క్లాసిక్ లుక్‌తో, రాజసం ఉట్టిపడేలా ఉంది.

ధోనీ రోడ్డుపై కారుతో బయలుదేరగానే అభిమానులు ఆశ్చర్యపోయారు. అరుదైన రోల్స్ రాయిస్ కారును, తమ ప్రియ క్రికెటర్‌ను చూడటానికి చాలా మంది ఆయన వాహనం వెనక పరుగులు తీశారు. కొందరు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీశారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Indian Hockey: ఆసియా కప్‌లో భారత్ సునామీ.. హాకీ జట్టుకు ప్రధాని మోదీ అభినందనలు!

ధోనీ గ్యారేజ్‌లో వింటేజ్ రోల్స్ రాయిస్ మాత్రమే కాదు, ఎన్నో అరుదైన కార్లు ఉన్నాయి:

  • జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్‌హాక్ – భారతదేశంలో మొదటగా ఈ SUVని కొన్నది ధోనీ. 
  • హమ్మర్ H2 – భారీ ఆకారంతో రోడ్డుపై ప్రత్యేకంగా కనిపించే ఈ వాహనం కూడా ఆయన కలెక్షన్‌లో ఉంది. 
  • నిస్సాన్ జొంగా – ఒకప్పటి భారత సైన్య వాహనాన్ని 2019లో కొనుగోలు చేసి మార్పులు చేయించారు. 
  • మెర్సిడెస్-బెంజ్ G63 AMG – లగ్జరీ SUVల్లో ప్రత్యేకమైనది. 
  • ఫెరారీ 599 GTO – సుమారు రూ. 3.57 కోట్ల విలువైన ఈ స్పోర్ట్స్ కారు ఆయన గ్యారేజ్‌లో హైలైట్. 
  • 1969 ఫోర్డ్ మస్టాంగ్ 429 ఫాస్ట్‌బ్యాక్ – వింటేజ్ వాహనాలపై ధోనీ ఆసక్తికి నిదర్శనం. 

కార్లతో పాటు ధోనీకి బైకులంటే కూడా అపారమైన ప్రేమ ఉంది. ఆయన గ్యారేజ్‌లో దాదాపు 70 బైకులు ఉన్నాయని చెబుతారు. హార్లే-డేవిడ్సన్ ఫ్యాట్‌బాయ్, కవాసకి నింజా H2, సుజుకి హాయాబుసా, కన్ఫెడరేట్ హెల్‌క్యాట్ వంటి అరుదైన బైకులు ఆయన కలెక్షన్‌లో ఉన్నాయి. ధోనీకి వాహనాలపై ఉన్న మమకారం, వాటిని కాపాడుకునే విధానం అనేక మంది అభిమానులకు స్ఫూర్తినిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *