Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 మొదలై ఐదో రోజు దాటింది. ఈ సీజన్లో సామాన్యులు, సెలబ్రెటీలు కలిసి ఆడుతుండటంతో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ డబుల్‌గా అందుతోంది. ఇప్పటికే మొదటి వారం నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. శ్రష్ఠి వర్మ, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, సంజనా గల్రానీ, తనూజా గౌడ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, డీమన్ పవన్, ఇమ్మానుయేల్ ఎలిమినేషన్ రేసులో ఉన్నారు. వీరిలో ఒకరు మొదటి వారం హౌస్‌ను విడిచి వెళ్లనున్నారు.
Bigg Boss 9: ఇక హౌస్‌లో తొలి కెప్టెన్‌గా సంజనా గల్రానీ ఎంపికైంది. ఓనర్స్–టెనెంట్స్ టాస్క్‌లో కొట్టుకొని చివరకు సంజనను కెప్టెన్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, హౌస్‌లో దాదాపు అందరూ ఆమె కెప్టెన్ అవ్వకూడదని కోరుకున్నా.. పరిస్థితులు తిరగబడి సంజనే ఫస్ట్ కెప్టెన్‌గా నిలిచింది.
కెప్టెన్ అవగానే సంజన డ్యూటీ మొదలుపెట్టింది. ఫ్లోరాను లగేజ్ తీసుకురమ్మని ఆర్డర్ వేసింది. అయితే ఫ్లోరా “తీసుకురాను” అంటూ ముఖం మీదే నిరాకరించింది. దీనిపై సంజన, కెప్టెన్ చెప్పింది వినకపోతే దాని పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. తర్వాత హౌస్ మొత్తానికి స్కిట్ చేయాలని, తనకు వంట చేసి పెట్టాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Bigg Boss Telugu: కొత్త సీజన్, కొత్త అగ్నిపరీక్ష మొదటి రోజే హీట్ పెంచిన కాంటెస్ట్‌లు
సంజన కెప్టెన్‌గా నిలవడంతో బిగ్ బాస్ అధికారికంగా అభినందనలు తెలిపాడు. ఆమెను టెంపరరీ ఓనర్‌గా కూడా ప్రమోట్ చేశాడు. కానీ కెప్టెన్ స్పెషల్‌గా పంపిన లగ్జరీ ఐటమ్స్‌ను కామనర్లు లేపేశారు. ముఖ్యంగా ప్రియ, శ్రీజ చాక్లెట్లు, చిప్స్ ప్యాకెట్లను కొట్టేశారు.
హౌస్‌మేట్స్‌ను ఇంప్రెస్ చేసే వారికి థమ్స్ అప్ ఇస్తానని సంజన డీల్ పెట్టింది. మొదటగా హరీష్ వచ్చి ఒక థమ్స్ అప్ తీసుకుని వెళ్ళిపోయాడు. అందరూ కలిసి చేసిన స్కిట్లో ఎవరు మెప్పిస్తే వారికి ఒక్కో బాటిల్ ఇస్తానని సంజన ప్రకటించింది. అయితే చివర్లో, “నా దగ్గర నుంచి ఎవరు థమ్స్ అప్ దొంగిలించారో చెప్తే అప్పుడే ఇవి ఇస్తాను” అంటూ ట్విస్ట్ ఇచ్చింది. దీంతో హౌస్మేట్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
బిగ్ బాస్ 9లో తొలి కెప్టెన్‌గా సంజన ఎంపిక కావడం హౌస్‌లో రచ్చ రచ్చకు దారి తీసింది. ఆమె కెప్టెన్సీ హౌస్‌మేట్స్‌ను ఎలా మలుపు తిప్పుతుందో చూడాలి.

