Hyderabad: హైదరాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ (ACB) భారీ స్థాయిలో స్పెషల్ ఆపరేషన్‌ను చేపట్టింది. మొత్తం 18 బృందాలుగా విభజించుకున్న ఏసీబీ అధికారులు, విద్యుత్ శాఖలో పనిచేస్తున్న పలువురు ఉన్నతాధికారుల ఇళ్లలో, కార్యాలయాల్లో, బంధువుల నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
Hyderabad: విద్యుత్‌శాఖలో అవినీతి, అక్రమాస్తులపై వచ్చిన పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ముఖ్యంగా మణికొండలో అడిషనల్ డివిజనల్ ఇంజినీర్ (ADE) అంబేద్కర్ నివాసం, బంధువుల ఇళ్లు, అలాగే ఆయన పనిచేస్తున్న కార్యాలయాన్ని ఏసీబీ బృందాలు తనిఖీ చేస్తున్నాయి. ఉదయం 5 గంటల నుంచే ఈ దాడులు ప్రారంభమయ్యాయి.
ఇది కూడా చదవండి: Vaishali: వైశాలి చారిత్రాత్మక విజయం – ట్రోఫీని తల్లి చేతుల్లో పెట్టి ఎమోషనల్ క్షణం!
ADE అంబేద్కర్‌పై గతంలోనూ అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలు వచ్చాయి. వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయని అందిన సమాచారంతో ఈ సోదాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో కూడా ఏసీబీ అధికారులు శోధన చర్యలు కొనసాగిస్తున్నారు.
ఈ చర్యలు అవినీతిపై ఏసీబీ సున్నా సహన విధానానికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని అధికారులపై కూడా ఇలాంటి దర్యాప్తులు జరగవచ్చని తెలుస్తోంది.
