Phone EMI: మొబైల్ ఫోన్ ఈరోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. స్మార్ట్‌ఫోన్ లేకుండా ఒక రోజు కూడా గడపడం కష్టమే. అందుకే చాలామంది ఒకేసారి మొత్తం డబ్బు పెట్టలేకపోతే ఈఎంఐ (EMI) ద్వారా ఫోన్లు కొనుగోలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు కొత్త ఆందోళన మొదలైంది. ఎందుకంటే సమయానికి పేమెంట్ చేయకపోతే ఫోన్‌నే లాక్ చేసే విధానం రాబోతోందట.
Phone EMI: ఫైనాన్స్ కంపెనీలు EMI డిఫాల్ట్‌లు తగ్గించడానికి ఒక ప్రత్యేక యాప్ లేదా సాఫ్ట్వేర్ ఫీచర్‌ని డివైస్‌లో ముందుగానే ఇన్స్టాల్ చేయాలని భావిస్తున్నాయి. ఈ యాప్ ద్వారా కస్టమర్ ఒకవేళ పేమెంట్ మిస్ చేస్తే, ఆటోమేటిక్‌గా ఫోన్ పనిచేయకుండా లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే, బాకీ క్లియర్ చేసే వరకు ఆ ఫోన్ వాడటం కష్టమే.
ఈ విధానాన్ని అమలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనుమతి అవసరం. ఫైనాన్స్ కంపెనీలు ఇప్పటికే RBIకి తమ ప్రతిపాదనలు సమర్పించాయి. ఒకవేళ RBI గ్రీన్ సిగ్నల్ ఇస్తే, రాబోయే నెలల్లో ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంకా ఇది తుది నిర్ణయం కాలేదు.
ఇది కూడా చదవండి: Trending: మానవత్వానికి ముద్ర వేసిన సంఘటన ముస్లిం యువకుడు హిందూ మాసి అంత్యక్రియలు నిర్వహించాడు!
ఈ నియమం వల్ల చాలా మందికి ఇబ్బందులు తలెత్తొచ్చని వినియోగదారుల సంఘాలు అంటున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి, రోజువారీ అవసరాల కోసం మొబైల్‌పై ఆధారపడేవారికి ఇది పెద్ద సమస్య కావొచ్చు. పేమెంట్ మిస్ అయిన వెంటనే ఫోన్ లాక్ అయితే అత్యవసర కాల్స్ కూడా చేయలేని పరిస్థితి రావొచ్చని లాయర్లు అభిప్రాయపడుతున్నారు.
ఒకవేళ ఈ రూల్ అమల్లోకి వస్తే —ముందే కస్టమర్ అనుమతి తీసుకోవడం తప్పనిసరి, అత్యవసర కాల్స్, ముఖ్యమైన యాప్‌లు యాక్సెస్ ఉండేలా గైడ్‌లైన్స్ రూపొందించడం, డేటా ప్రైవసీ పరిరక్షణకు కఠినమైన నిబంధనలు పెట్టడం వంటి షరతులు ఉండే అవకాశం ఉంది.
వినియోగదారులకు సూచనలు
- EMI ద్వారా ఫోన్ కొనేటప్పుడు ఒప్పందంలోని ప్రతీ షరతును బాగా చదవాలి.
- పేమెంట్ మిస్ కాకుండా టైమ్‌కు చెల్లించాలి.
- ఎలాంటి లాకింగ్ యాప్ ఇన్స్టాల్ అవుతోందో, అది డేటా యాక్సెస్ చేస్తుందా లేదా అని ముందుగానే అడిగి తెలుసుకోవాలి.
మొత్తానికి, ఫోన్‌ను EMIలో కొనడం సులభమే అయినా, కొత్త నియమాలు వస్తే జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే ఒకవేళ పేమెంట్ మిస్ అయితే, ఫోన్‌నే వాడలేని పరిస్థితి ఎదురవచ్చు.
