Viral Video: కూతురి మంచం మీద నల్ల తాచు.. వీడియో తీస్తున్న తల్లిదండ్రులు నెటిజన్ల ఆగ్రహం

Viral Video: “నాకు పిచ్చి కుదిరింది, తలకు రోకలి చుట్టండి” అన్న సామెతను గుర్తుచేసేలా కొంతమంది సోషల్ మీడియా కోసం చేసే పనులు ఉంటాయి. రీల్స్‌, లైక్స్ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రవర్తించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా ఇలాంటి ఓ సంఘటన నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Viral Video: ఈ వీడియోలో ఒక చిన్నారి మంచం మీద నిద్రపోతుండగా, పక్కనే ఒక నల్ల పాము నెమ్మదిగా పాకుతూ వెళ్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బాలిక ఆ పాము తోకను తన చేతితో పట్టుకుని గుండెల దగ్గర పెట్టుకుంది. ఈ సన్నివేశాన్ని చూసి నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఇది కూడా చదవండి: Rajendranagar: రాజేంద్రనగర్‌లో మహిళ మృతదేహం కలకలం – రేప్ అండ్ మర్డర్‌గా అనుమానం!

సాధారణంగా పాములు కనిపిస్తే పెద్దవాళ్లు కూడా భయంతో దూరం పారిపోతారు. కానీ ఇక్కడ బాలిక మాత్రం ఎలాంటి భయం లేకుండా పాముతో ఆడుకుంటోంది. తల్లిదండ్రులు ఆమెను ఆ పాముని దూరం చేయకుండా వీడియో రికార్డ్ చేయడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.

అయితే, ఈ వీడియో వెనుక ఉన్న నిజం బయటపడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో @snakemasterexotics అనే అకౌంట్ ఈ వీడియోను షేర్ చేసింది. ఆ అకౌంట్ ప్రొఫైల్ ప్రకారం, ఆ పాము నిజానికి ఆ బాలిక కుటుంబం పెంచే పెంపుడు జంతువు. వారు అనేక రకాల పాములను, సరీసృపాలను పెంచుతూ, మ్యూజియం కూడా నిర్వహిస్తున్నారు. అందుకే ఆ అమ్మాయికి పాములపై భయం ఉండదు.

 

View this post on Instagram

 

A post shared by Ariana (@snakemasterexotics)

సెప్టెంబర్ 6న షేర్ చేయబడిన ఈ వీడియోను ఇప్పటివరకు 5.5 లక్షల మందికి పైగా వీక్షించారు. నెటిజన్లు మాత్రం మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు ఇది అమ్మాయి తల్లిదండ్రుల నిర్లక్ష్యం అని వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు “పిల్లల ప్రాణాలను వీక్షణల కోసం పణంగా పెట్టడం మూర్ఖత్వం” అని విమర్శిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *