Dipika Padukone: దీపికా మా మూవీలో లేదు . . ఇదే నిజం

Dipika Padukone: యంగ్ రెబల్ స్టార్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం కల్కి2898ఎడి. వైజయంతి మూవీస్ బేనర్ పై వచ్చిన ఈ మూవీ సృష్టించిన కలెక్షన్ల సునామీ అంతా ఇంతా కాదు .  ఈ మూవీలో హీరోయిన్ గా దీపికా పదుకొనే చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కల్కి మూవీ పాన్ ఇండియా రేంజిలో పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది .  ఇక కల్కి మూవీలో దీపికా ప్రధాన పాత్ర. ఆమె సీక్వెల్ లో కూడా ఉంటుందని అందరూ భావించారు .  ఈ నేపథ్యంలో కల్కి మూవీ సీక్వెల్ నుంచి బిగ్ అప్ డేట్ వచ్చింది. ఇప్పటివరకూ కల్కి సీక్వెల్ లో హీరోయిన్ విషయమై ఎన్నో వదంతులు షికార్లు  చేస్తున్నాయి . ముఖ్యంగా హీరోయిన్ విషయంలో ఎన్నో పేర్లు తెరమీదకు వచ్చాయి .  వాటిలో దీపికాపదుకొనె పేరు ఇటీవల కాలంలో నెట్టింట్లో బాగా ప్రచారంలో ఉంది .  అయితే ,  ఈ ప్రచారానికి ప్రొడక్షన్ హౌస్ తెర దించింది .  తమ కల్కి మూవీలో దీపికా హీరోయిన్ గా చేయడం లేదని ప్రకటించింది.

జాగ్రత్తగా ఆలోచించిన తరువాత కల్కి సీక్వెల్ లో దీపికాను తీసుకోకూడదని నిర్ణయించుకున్నామని మేకర్స్ తమ ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు .  కల్కి మూవీ చాల లార్జ్ స్కెల్ మూవీ కావడం . . ఎక్కువ సమయం దీనికోసం అందరూ కేటాయించల్సి ఉందని టీమ్ పేర్కొంది .  దీపికా తో ప్రయాణం ఈ మూవీలో కష్టమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది మూవీ టీమ్ .

ఇది కూడా చదవండి : రొమాంటిక్ హీరో నుంచి శక్తివంతమైన విలన్ వరకూ.. అరవింద్ స్వామి జీవన ప్రయాణం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *