Pokiri Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ చిత్రాన్ని చేస్తున్నారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మహేష్ బాబుకు ఇది మరో మైలురాయి కావొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు.
Pokiri Movie: మహేష్ కెరీర్లో మలుపు తిప్పిన చిత్రాలలో పోకిరి ఒకటి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించి మహేష్ బాబుకు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇది కూడా చదవండి: OTT Movies: ఓటీటీ ప్రేక్షకులకు దసరా స్పెషల్.. ఈ వారం అద్దిరిపోయే సినిమాలు!
అయితే ఈ పాత్రకు మొదట ఎంపికైనది ఇలియానా కాదు. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ను మొదటగా పోకిరి సినిమా కోసం అప్రోచ్ చేశారు. కానీ ఆ సమయంలో కంగనా హిందీలో గ్యాంగ్స్టర్ మూవీ షూటింగ్తో బిజీగా ఉండడంతో డేట్స్ కుదరకపోవడంతో ఆమె ఈ అవకాశాన్ని వదులుకుంది.
తర్వాత ఇలియానా ఈ సినిమాలో నటించి ఓ భారీ హిట్ అందుకుంది. అయితే పోకిరి సినిమా మిస్ అవ్వడం పట్ల కంగనా తరువాత ఒక ఇంటర్వ్యూలో బాధ వ్యక్తం చేసింది.
View this post on Instagram
కానీ తెలుగు తెరపైకి మాత్రం ఆమె ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ సినిమాతో వచ్చింది. ఆ సినిమా పెద్ద హిట్ కాకపోయినా, కంగనాకు టాలీవుడ్లో మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉండి రాజకీయాల్లో బిజీగా ఉంటోంది.
