China Viral Video: ఇప్పటి వరకు తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు చూసివుంటాం కానీ గుడ్లతో రోడ్ ఏందిరా!

China Viral Video: గుడ్లు పోషకాహారానికి మాత్రమే కాకుండా రోడ్లు నిర్మించడంలో కూడా ఉపయోగపడతాయంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. చైనాలో గుడ్ల పెంకులను కాంక్రీట్ మిశ్రమంలో కలిపి రోడ్లు వేస్తున్నారని, అవి సిమెంట్‌ను బలపరచి రోడ్లను అత్యంత మన్నికగా మారుస్తాయని చెబుతున్నారు.

China Viral Video: మన దేశంలో రోడ్లు నిర్మించగానే కూలిపోవడం సాధారణం. కానీ చైనాలో రోడ్లు దశాబ్దాల తరబడి చెక్కుచెదరకుండా ఉంటాయి. కారణం గుడ్డు పెంకులే. శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం, పెంకుల్లో ఉండే కాల్షియం కార్బోనేట్‌ కాంక్రీట్ బలం పెంచి పగుళ్లను తగ్గిస్తుంది. ఇదే విషయాన్ని బీజింగ్ విశ్వవిద్యాలయం పరిశోధనలోనూ రుజువు చేశారు.

ఇది కూడా చదవండి: Viral Video: స్కూటర్‌పై ప్రమాదకర స్టంట్ – యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్!

#EggRoadChina పేరుతో TikTok, Instagramలలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో గుడ్లను రోడ్డుపై వేసి, వాటిని మిశ్రమంలో కలిపి రోడ్లు నిర్మిస్తున్నట్లు చూపిస్తున్నారు. చైనా ప్రభుత్వం కూడా ఈ సాంకేతికతను ప్రోత్సహిస్తూ, షాంఘై–పుడాంగ్ ఎక్స్‌ప్రెస్‌వేలో 50 కిలోమీటర్ల విభాగాన్ని ఇదే విధానంతో నిర్మించింది. నివేదికల ప్రకారం, ఈ రోడ్డు జీవిత కాలం 30 నుంచి 50 సంవత్సరాలకు పెరిగిందని తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Totalworld (@totalworld580)

ప్రతి సంవత్సరం బిలియన్ల కొద్దీ గుడ్లు ఉత్పత్తి చేసే చైనాలో, పెంకులు ఒకప్పుడు వ్యర్థాలుగా మారేవి. ఇప్పుడు వాటిని రీసైకిల్ చేస్తూ గ్రీన్ కన్‌స్ట్రక్షన్‌గా మారుస్తున్నారు. ఈ ప్రయత్నానికి పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక అవార్డును కూడా అందించింది.

ఈ ఆవిష్కరణపై IIT ఢిల్లీ ప్రొఫెసర్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ, “భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద గుడ్డు ఉత్పత్తిదారు. మన దేశంలో ఏటా 1 మిలియన్ టన్నుల గుడ్డు పెంకులు వ్యర్థాలుగా మారుతున్నాయి. వీటిని రోడ్ల నిర్మాణంలో ఉపయోగిస్తే రోడ్లు బలంగా మారడమే కాకుండా కాలుష్య సమస్య కూడా తగ్గుతుంది” అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *