Funny Video: మనిషి కోతి నుండి వచ్చాడంటే ఏమో అనుకున్న కానీ ఈ వీడియో చుస్తే నిజమే అనిపిస్తుంది!

Funny Video: అడవిలో నడవడం అంటే వేరే ప్రపంచంలోకి వెళ్లినట్లే ఉంటుంది. అక్కడ మన కంటికి ఎప్పుడూ కనిపించని వింత దృశ్యాలు, అనుభవాలు ఎదురవుతాయి. అందుకే జంగిల్ సఫారీలు ప్రజలకు ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి. అలా ఒక జంగిల్ సఫారీ సమయంలో పర్యాటకులు మర్చిపోలేని ఒక ఘటన ఎదుర్కొన్నారు. ఆ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Funny Video: వైరల్ వీడియోలో, ఒక పడవలో కూర్చుని పర్యాటకుల బృందం అడవి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. అదే సమయంలో అకస్మాత్తుగా ఒక పెద్ద గొరిల్లా అక్కడికి చేరుకుంది. దాన్ని చూసి కొంతమంది పర్యాటకులు భయపడ్డారు. కానీ అది దాడి చేయకుండా సరదాగా వారితో ఆటలాడింది. పర్యాటకుల దగ్గరికి వెళ్లి ఒక్కసారిగా నీళ్లు చల్లి… వెంటనే అక్కడి నుంచి పరుగెత్తింది. ఈ అల్లరి చూసి అందరూ కాసేపు గబ్బున నవ్వుకున్నారు.

ఇది కూడా చదవండి: PM Modi: సిఆర్ పార్క్ దుర్గా పూజ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ!

ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @AMAZlNGNATURE అనే అకౌంట్ షేర్ చేసింది. “ఆ గొరిల్లా ఎవరూ చూడకుండా చూసుకుంది” అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చారు. కేవలం 8 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 65 వేల మందికి పైగా వీక్షించారు. వందలాది మంది లైక్‌లు, షేర్‌లు చేస్తూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు “జంతువులు కూడా ఎంత చిలిపిగా ఉంటాయో ఈ వీడియోలో తెలుస్తోంది”, “అడవిలోని రియల్ ఎంటర్టైన్మెంట్ ఇదే” అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది అయితే “ఇది చూడగానే రోజంతా నవ్వు ఆగడం లేదు” అంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *