Andhra Pradesh: అసలేం జరుగుతోంది..చిన్నారుల మృతి ఘటనలపై ప్రభుత్వం సీరియస్‌..!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న చిన్నారుల మృతి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు మరణించగా, అనంతపురంలోని శిశుగృహంలో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించి, కారణాలు తేల్చాలని ఆదేశాలు జారీ చేసింది.

Andhra Pradesh: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలోని బాలికల గురుకుల పాఠశాలలో తీవ్ర జ్వరం, పచ్చకామెర్లతో ఇద్దరు విద్యార్థినులు చనిపోగా, మరో 120 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అధికారులు తక్షణమే స్పందించి, విశాఖ కేజీహెచ్‌ సహా పలు ఆస్పత్రులకు విద్యార్థులను తరలించారు.

ఇది కూడా చదవండి: Hyderabad: హైదరాబాదీలకు పండుగలాంటి వార్త.. రవాణా రంగంలో కొత్త అధ్యాయం!

మంత్రి గుమ్మడి సంధ్యారాణి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను స్వయంగా పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా స్పందించారు. మంత్రి సంధ్యారాణికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, “మన్యం ప్రాంతంలో వర్షాలు పడగానే జ్వరాలు విజృంభిస్తాయి. దసరా సెలవుల్లో విద్యార్థులు ఇంటికి వెళ్లి రావడంతో అక్కడి నీటి సమస్యల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని” పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ICU Fire Accident: తీవ్ర విషాదం ఐసియులో అగ్నిప్రమాదం.. పేషెంట్లు కాలిబూడిద!

అనంతపురంలోని శిశుసంరక్షణ కేంద్రంలో ఓ చిన్నారి మృతి చెందడం మరింత కలకలం రేపింది. సిబ్బంది మృతదేహాన్ని పూడ్చివేయడం వివాదాస్పదమైంది.  ఈ ఘటనపై ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించినట్టు కలెక్టర్ తెలిపారు. మంత్రి సంధ్యారాణి వివరాలు వెల్లడిస్తూ, “చిన్నారికి గుండె సంబంధిత సమస్యలున్నాయి, అదే కారణంగా మృతి చెందినట్టు సమాచారం అందింది” అన్నారు.

రెండు ఘటనలపై కూడా సీఎం చంద్రబాబు తీవ్రంగా ఆరా తీశారు. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  మరోవైపు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను వైసీపీ నేతలు కూడా పరామర్శించి, ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ ఘటనలతో రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పిల్లల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *