Two Headed Snake: రెండు తలల పామును మీరెప్పుడైనా చూశారా? నిజానికి ఇది చాలా అరుదు. సాధారణంగా మనం రెండు తలల పాముగా చెప్పుకునే పాము ఒకటి మనకి కనిపిస్తూ ఉంటుంది. అది రెండువైపులా కదులుతూ ఉంటుంది. అందుకే మనం దానిని రెండు తలల పాము అని పిలుస్తాము. కానీ, ఆ పాముకు ఒకే తల ఉంటుంది. తోక భాగం కూడా తలలా కనిపిస్తుంది. అది శత్రువును కన్ఫ్యూజ్ చేయడం కోసం రెండు వైపులా కదులుతుంది. అందుకే దానికి రెండు తలలు ఉన్నాయనే భ్రమ కలుగుతుంది. అంతే.
సరే ఇది పక్కన పెడితే ఇటీవల కాలంలో కాలిఫోర్నియాలో పుట్టిన కాలిఫోర్నియా కింగ్ స్నేక్ జాతికి చెందిన రెండు తలల పాము ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దాని స్పెషాలిటీ ఏమిటంటే.. ఒకే శరీరానికి రెండు తలలు పక్కపక్కన ఉండడం. రెండు తలలకు ప్రత్యేకమైన మెదడు ఉండడం. నాటే శరీరం ఒక్కటే.. తలలు మాత్రం రెండన్నమాట. ఇవి రెండూ వేటికవి ప్రత్యేకంగా ఆలోచించగలిగే పరిజ్ఞానం కలిగి ఉన్నాయి. కానీ వీటికి తల తప్ప మిగిలిన అవయవాలు అన్నీ ఒకటే. కాలిఫోర్నియాలోని ఈస్ట్ బే వివేరియం అనే పెట్ స్టోర్ లో ఈ అరుదైన పాము పుట్టింది.
Two Headed Snake: గతేడాది అంటే పది నెలల క్రితం పుట్టిన ఈ పాము సజీవంగా ఉంది. సాధారణంగా ఇలా పుట్టిన పాములు పుట్టిన కొద్దిసేపటికే చనిపోతాయి. అయితే, ఇది మాత్రం ఇంకా ఆరోగ్యంగా జీవిస్తూ ఉంది. ఈ పాము రెండు తలలకు వేర్వేరు పేర్లు పెట్టారు స్టోర్ నిర్వాహకులు. అవి జీక్” – “ఏంజెల్” ఈ రెండిటిలో ఏంజెల్ తల కొంత చురుకుగా ఉంటుంది. తరచుగా ఈ రెండు తలల మధ్య చిన్న చిన్న ఫైట్స్ జరుగుతుంటాయి. కుడివైపుకు వెళ్లాలని ఏంజెల్ అనుకుంటే.. జీక్ ఎడమ వైపుకు వెళ్లాలని అనుకునుంటుంది. దీంతో ఇబ్బంది వస్తుంది.
ఎందుకిలా?
Two Headed Snake: ఇలా రెండు తలలు.. ఒక శరీరం ఎక్కడో కానీ జరగదు. ఇది అన్ని జీవుల్లోనూ సంభవిస్తుంది. కాకపోతే అరుదుగా. ఇలా పుట్టడాన్ని శాస్త్రీయంగా ‘బైసెఫాలీ’ అంటారు. మనుషుల్లో కూడా ఇలా రెండు తలలు ఒక శరీరంతో పుట్టిన వాళ్ళు మనకు తెలుసు. ఉదాహరణకు వీణా, వాణి మన తెలుగు రాష్ట్రంలోనే పుట్టారు. అలాగే, అన్ని జీవుల్లోనూ ఇలాంటి పుట్టుకలు ఉంటాయి. అయితే, ఇలా పుట్టిన జీవులు ఒక్కరోజు లోపే చనిపోతాయి. ఎక్కువ కాలం జీవించడం దాదాపు అసాధ్యం. ఇప్పుడు ఈ రెండు తలల పాము పది నెలలకు పైగా జీవించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్..
Two Headed Snake: ఈ పాముకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. పెట్ స్టోర్ అధికారులు ప్రత్యేకంగా ఈ స్నేక్ను చూడడం కోసం అవకాశం ఇవ్వడంతో స్టోర్ కు వీటిని చూడటానికి విపరీతముగా వస్తున్నారు. అంతేకాదు సైన్టిస్ట్స్ కూడా వీటిని చూడాలని పెట్ స్టోర్ కు వెళుతుండడం విశేషం. ఈ పాము కేవలం ప్రదర్శన కోసం మాత్రమే ఉంచుతున్నామని.. వీటిని అమ్మే ప్రసక్తి లేదని అక్కడి అధికారులు చెబుతున్నారు.
అదండీ విషయం.. కాలిఫోర్నియా కింగ్ స్నేక్లు సాధారణ పరిస్థితులలో 20–30 సంవత్సరాలు జీవిస్తాయి. ఇలా పుట్టిన అరుదైన పాములు వెంటనే మరణిస్తాయి. అయితే ఈసారి అరుదైన రెండు తలల పాము పది నెలలుగా సజీవంగా ఉంది రికార్డుసృష్టించింది. ఈ అరుదైన పాము పూర్తి జీవితకాలం జీవించాలని ఈస్ట్ బే వివేరియం పెట్ స్టోర్ నిర్వాహకులు ఆకాంక్షిస్తున్నారు. మనం కూడా అదే కోరుకుందాం.
