RRB NTPC Jobs 2025: దేశంలోని అన్ని రైల్వే రీజియన్లలో 2025 సంవత్సరానికి సంబంధించి నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) గ్రాడ్యుయేట్ ఇంకా అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 8,050 ఖాళీలు భర్తీ చేయనుంది, ఇందులో 5,000 గ్రాడ్యుయేట్ పోస్టులు, 3,050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి.
ఆన్లైన్ దరఖాస్తు తేదీలు:
- గ్రాడ్యుయేట్ పోస్టులు: అక్టోబర్ 21, 2025 నుండి ప్రారంభం
- అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు: అక్టోబర్ 28, 2025 నుండి ప్రారంభం
- గ్రాడ్యుయేట్ దరఖాస్తు ముగింపు: నవంబర్ 20, 2025
- అండర్ గ్రాడ్యుయేట్ దరఖాస్తు ముగింపు: నవంబర్ 27, 2025
- రాత పరీక్ష తేదీలు: త్వరలో ప్రకటించనున్నారు
ఇది కూడా చదవండి: ACP Death: ‘పుష్ప 2’ తొక్కిసలాట కేసుతో గుర్తింపు పొందిన ఏసీపీ మృతి!
భర్తీ చేయబోయే రీజియన్లు:
అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్పుర్, జమ్మూ – శ్రీనగర్, కోల్కతా, మాల్దా, ముంబయి, ముజఫర్పూర్, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం
భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు:
- గ్రాడ్యుయేట్ స్థాయి: గూడ్స్ రైలు మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్, స్టేషన్ మాస్టర్, సీనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్, చీఫ్ కమర్షియల్-కమ్-టికెట్ సూపర్వైజర్, ట్రాఫిక్ అసిస్టెంట్
- అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి: కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్-కమ్-టైపిస్ట్, జూనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్, రైళ్ల క్లర్క్
అర్హత ఇంకా వయోపరిమితి:
- గ్రాడ్యుయేట్ పోస్టులు: ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత, వయస్సు 16–33 ఏళ్లు
అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, వయస్సు 18–38 ఏళ్లు
