Hyderabad: మాదాపూర్‌లో అక్రమ సరోగసీ రాకెట్‌ భయంకర నిజాలు..!

Hyderabad: హైదరాబాద్ నగరంలో ఫెర్టిలిటీ కేంద్రాలపై పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. తాజాగా మాదాపూర్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ అపార్ట్‌మెంట్‌లో గుట్టుగా అక్రమ సరోగసీ, ఎగ్ ట్రేడింగ్ చేస్తూ పలువురిని పోలీసులు పట్టుకున్నారు.

దాడిలో బయటపడ్డ రహస్యం

Hyderabad: డీసీపీ కోటిరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, మాదాపూర్‌లో మొత్తం ఏడుగురు మహిళలు, ఒక పురుషుడు – కలిపి ఎనిమిది మంది కమర్షియల్ సరోగసీ, అక్రమ ఎగ్ ట్రేడింగ్‌లో పాల్గొన్నట్లు తేలింది. పిల్లలు లేని దంపతులను టార్గెట్‌గా చేసుకుని, ఒక్కో కేసులో రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ప్రధాన నిందితురాలి నేపథ్యం

ఈ రాకెట్‌కు ప్రధాన సూత్రధారి నర్రెద్దుల లక్ష్మిరెడ్డి అలియాస్ లక్ష్మి. గతంలో ఆమె స్వయంగా ఎగ్ డోనర్‌, సరోగసీ మదర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఆ అనుభవంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో, కొన్ని ఫెర్టిలిటీ ఆస్పత్రులకు ఏజెంటుగా మారి అక్రమ సరోగసీ రాకెట్‌ను నడిపింది.

తల్లి-కొడుకుల కలసికట్టుగా నేరం

లక్ష్మి కుమారుడు నరేందర్‌ రెడ్డి (A2) కూడా ఈ వ్యాపారంలో కీలక పాత్ర పోషించాడు. జేఎన్టీయూలో కెమికల్ ఇంజనీరింగ్ చదివిన అతడు, తల్లి వ్యాపారంలో చేతులు కలిపాడు. డబ్బు అవసరం ఉన్న పేద మహిళలను టార్గెట్‌ చేసి, వారిని ఎగ్ డొనేట్ చేయించడంతోపాటు, కొందరిని సరోగసీకి ఒప్పించారు. ఈ ప్రక్రియలో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.

సాక్ష్యాలు, స్వాధీనం

దాడిలో భాగంగా, పోలీసులు రూ. 6.47 లక్షల నగదు, లెనోవో ల్యాప్‌టాప్‌, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా, అపార్ట్‌మెంట్‌లో సిరంజీలు, గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజెక్షన్లు, మరియు హెగ్డే హాస్పిటల్ కేస్ షీట్లు కూడా చేశారు. ఈ కేసులో పోలీసులు మరిన్ని అనుమానితులపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *