జీయర్ స్వామి ఆశీస్సులతో విద్యార్థుల్లో సమానత్వ జాగృతి,
కరీంనగర్లో వ్యాస, వక్తృత్వ పోటీల ఫలితాలు విడుదల చేసిన ప్రజ్ఞా వికాస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు, కోట జూనియర్ కళాశాలల చైర్మన్ డాక్టర్ డి అంజిరెడ్డి
రాష్ట్ర ఫైనల్స్‌కి నలుగురికి అర్హత
కరీంనగర్, విద్యార్థుల్లో కృతజ్ఞత, సమానత్వ భావనలు పెంపొందించాలనే ఉద్దేశంతో
శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి మంగళాశాసనాలతో *రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ప్రతిభా పోటీలో భాగంగా కరీంనగర్ జిల్లాలో విజయవంతంగా నిర్వహించబడ్డాయి *ట్రస్మా ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల నుంచి ఆరవ తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
కరీంనగర్ లోని కోట రెసొనెన్స్ జూనియర్ కళాశాలలో జరిగిన వ్యాసరచన మరియు వక్తృత్వ విభాగాల్లో గణనీయ సంఖ్యలో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. పూర్తయిన పరీక్షల ఫలితాలను నేడు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విడుదల చేశారు.
వ్యాసరచన విభాగంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల, కరీంనగర్ కు చెందిన బి. సాయి శ్రేష్ఠ ప్రథమ స్థానం,మరియు సరస్వతి పాఠశాల, వెలిచాలకు చెందినటువంటి నెట్టు సంజన ద్వితీయ స్థానం సాధించారు.
వక్తృత్వ విభాగంలో పారామిత హెరిటేజ్ స్కూల్ విద్యార్థి ఎ. సినీతిక ప్రథమ స్థానం, జెడ్పీహెచ్ఎస్ ఆసిఫ్‌నగర్ విద్యార్థి డి. లక్ష్మీ శ్లోక ద్వితీయ స్థానం గెలుచుకున్నారు
జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సాధించిన ఈ నలుగురు విద్యార్థులు హైదరాబాద్‌లోని జీయర్ స్వామి వారి ఆశ్రమంలో జరగనున్న రాష్ట్రస్థాయి ఫైనల్ పోటీల్లో పాల్గొననున్నారు.
రాష్ట్రస్థాయి విజేతలకు బహుమతులు స్వయంగా చిన్నజీయర్ స్వామివారి చేతుల మీదుగా ప్రదానం చేయబడనున్నాయి.
ఫలితాలను ప్రజ్ఞ వికాస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్‌రావు, కోట జూనియర్ కళాశాలల చైర్మన్ డాక్టర్ డి. అంజిరెడ్డి సంయుక్తంగా విడుదల చేశారు,మరియు వికాస్ తరంగిణి అధ్యక్షులు గౌతమ్ రావు గారి అధ్యక్షతన జరిగింది.
విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రస్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని వారు అభిలషించారు.

