Andhra Pradesh: కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్

Andhra Pradesh

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ఇచ్చింది. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తూ వస్తోన్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. స్క్రీన్ పై కనిపిస్తున్న వెబ్సైట్ లోకి లాగిన్ అవడం ద్వారా అభ్యర్థులు దీనికోసం అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ విడుదల చేసిన విషయాన్ని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. డిం

అప్లై చేసుకోవడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..
Andhra Pradesh: డీఎస్సికి అప్లై చేయడానికి అభ్యర్థులు వెబ్సైట్ లోకి వెళ్ళాలి. కొత్త యూజర్లు తప్పనిసరిగా యూజర్ ఐడీని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం అందులో సూచించిన ఫామ్‌ను నింపాలి. అది ఫీల్ చేశాకా వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ అందుతుంది.యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ అందిన తరువాత DSC 2025 అప్లికేషన్ ఫామ్‌లో సూచించిన ప్రొఫైల్‌లో తమ పూర్తి వివరాలను పొందుపరచాలి.

ఫొటో తప్పనిసరి. దీనితో సెక్షన్ 1 పూర్తి అయినట్టవుతుంది. ఆ తరువాత సెక్షన్‌ 2లోకి వెళ్లాలి.
సెక్షన్ 2లో అభ్యర్థులు తమ అకడమిక్, విద్యార్హతలను ఇవ్వాలి. 4 నుంచి 10వ తరగతి వరకు ఏ జిల్లాల్లో చదివారో అందులో వివరించాలి. అండర్ గ్రాడ్యుయేట్ అయితే- అక్కడ చూపించిన యూజీ అనే బటన్‌ ప్రెస్ చేయాలి.
Andhra Pradesh: దీని తరువాత APTET Qualification వివరాలను అందులో మెన్షన్ చేయాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తి కావడానికి ఇది అవసరం. అదనపు అర్హతలు ఏవైనా ఉంటే ఇందులో స్పష్టంగా వెల్లడించాల్సి ఉంటుంది. దీనితో దరఖాస్తు ఫామ్ పూర్తిగా నింపినట్టవుతుంది. సబ్మిట్ బటన్ నొక్కడానికి ముందు వివరాలన్నింటినీ సరిగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏవైనా తప్పులు ఉంటే అక్కడే ఎడిట్ చేసుకోవచ్చు. అనంతరం చెక్ బాక్సులను టిక్ చేయాలి.

Andhra Pradesh: ఆ తరువాత సెక్షన్ 3 ఓపెన్ అవుతుంది. ఇందులో- అభ్యర్థులు తమ జిల్లా, జోన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఏ జిల్లాల్లో, ఏ సబ్జెక్టులో ఎన్ని డీఎస్సీ పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ చూడొచ్చు. పరీక్షా కేంద్రాన్ని ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు. రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే 1,500 రూపాయల పరీక్షా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *