Shocking News: చైనాలో ఒక వ్యక్తి కడుపులో టూత్ బ్రష్ దొరికింది. ఈ టూత్ బ్రష్ గత 52 సంవత్సరాలుగా ఈ చైనీస్ వ్యక్తి ప్రేగులలో ఇరుక్కుపోయింది. పరీక్ష తర్వాత, అతనికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. ఆ వ్యక్తి ప్రేగుల నుండి 17 సెం.మీ పొడవున్న టూత్ బ్రష్‌ను తొలగించడానికి వైద్యులకు 80 నిమిషాలు పట్టింది.
Shocking News: చైనాలో ఒక వ్యక్తి కడుపులో టూత్ బ్రష్ కనిపించి ఒక వైద్యుడు షాక్ అయ్యాడు. అతనికి కొన్ని రోజులుగా కడుపు నొప్పి వస్తోంది. అతను డాక్టర్ దగ్గరికి వెళ్లి పరీక్షించుకున్నప్పుడు, అతని కడుపులో టూత్ బ్రష్ ఉందని తేలింది. ఆ వ్యక్తి 12 సంవత్సరాల వయసులో అనుకోకుండా టూత్ బ్రష్ మింగేశాడు. ఈ విషయాన్ని అతను తన తల్లిదండ్రులకు చెప్పలేదు. ఒకవేళ చెబితే తనను వారు తిడతారని, కొడతారని భయపడ్డాడు.
ఇప్పుడు భరించలేని కడుపునొప్పితో డాక్టర్ వద్దకు వెళితే స్కానింగ్ లో విష్యం తెలిసింది. దీని తరువాత అతనికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. అతని పేగుల్లోంచి 17 సెం.మీ పొడవున్న బ్రష్‌ను తొలగించడానికి డాక్టర్‌కు 80 నిమిషాలు పట్టింది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, తూర్పు చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌కు చెందిన యాంగ్ అనే వ్యక్తి 12 సంవత్సరాల వయసులో టూత్ బ్రష్‌ను మింగేశాడు. ఆ టూత్ బ్రష్ దానంతట అదే కరిగిపోతుందని యాంగ్ భావించాడు. టూత్ బ్రష్ అతని చిన్న ప్రేగులో ఇరుక్కుపోయింది.
ఇప్పటివరకు, టూత్ బ్రష్ వల్ల ఎటువంటి సమస్యలు రాలేదు, కానీ ఇటీవల కడుపు నొప్పి పెరగడంతో ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు అతని జీర్ణవ్యవస్థను పరిశీలించినప్పుడు, టూత్ బ్రష్ అతని చిన్న ప్రేగులలో ఇరుక్కుపోయిందని కనుగొన్నారు.
Shocking News: 80 నిమిషాల ఎండోస్కోపిక్ సర్జరీ ద్వారా పేగు నుండి 17 సెం.మీ పొడవున్న బ్రష్‌ను తొలగించారు. సాధారణంగా, బ్రష్ పేగు ఒక వైపు నుండి మరొక వైపుకు కదులుతుంది, నొప్పిని కలిగిస్తుంది, వివిధ భాగాలలోకి చొచ్చుకుపోతుంది, పేగులో రంధ్రం ఏర్పడుతుంది అలానే ప్రాణాపాయం కూడా కలిగిస్తుంది. కానీ ఈ విషయంలో యాంగ్ అదృష్టవంతుడు. దానివల్ల పెద్దగా నొప్పి కలగలేదు. ఎటువంటి నష్టం జరగకుండా అది అక్కడే ఉంది. చివరకు శస్త్రచికిత్స ద్వారా బ్రష్‌ను తొలగించారు ఇపుడు యాంగ్ బాగానే ఉన్నాడు.
