PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం మరో అరుదైన విజయాన్ని సాధించింది. 2030 నాటికి శిలాజేతర ఇంధన ఆధారిత విద్యుత్ ఉత్పత్తిలో 50 శాతం వాటా సాధించాలన్న లక్ష్యాన్ని దేశం ఇప్పటికే ఐదేళ్ల ముందే చేరుకుంది. ఇది పర్యావరణ పరిరక్షణ రంగంలో భారత్ సాధించిన అసాధారణ ప్రగతికి నిదర్శనంగా నిలుస్తోంది.
PM Modi: నూతన, పునరుత్పాదక ఇంధనాల అభివృద్ధికి కేంద్రం చేపట్టిన చర్యలు ఫలిస్తుండగా, ప్రస్తుతం దేశ స్థాయిలో 484.8 గిగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో 242.8 గిగావాట్లు శిలాజేతర ఇంధనాల ద్వారా ఉత్పత్తి అవుతోంది. అంటే, శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా సోలార్, విండ్, హైడ్రో విద్యుత్ వనరులు సగానికి పైగా వాటాను సంపాదించాయి.
ఇది కూడా చదవండి: Breaking News: చిరంజీవి పిటిషన్పై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు.. GHMCపై ఆదేశాలు జారీ
PM Modi: ఈ సందర్భంగా కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రి ప్రహ్లాద్ జోషి తన ట్వీట్లో మాట్లాడుతూ –
“ఇది కేవలం ఒక గణాంకం కాదు.. పర్యావరణ అనుకూల భారత్ దిశగా వేయబడిన దీర్ఘకాలిక అడుగు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచానికి మార్గదర్శిగా మారుతోంది” అని పేర్కొన్నారు.
In a world seeking climate solutions, India is showing the way.
Achieving 50% non-fossil fuel capacity five years ahead of the 2030 target is a proud moment for every Indian.
Hon’ble PM Shri @narendramodi ji’s leadership continues to drive Bharat’s green transformation — paving… pic.twitter.com/ydzWErWQNC
— Pralhad Joshi (@JoshiPralhad) July 14, 2025
PM Modi: భారతదేశం ఎక్కువగా బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్పై ఆధారపడుతున్న సమయంలో, శిలాజేతర విద్యుత్లో ఇలా దూసుకెళ్లడం గణనీయమైన పరిణామం. గాలి, సూర్య శక్తులవంటి పునరుత్పాదక వనరులపై పెట్టుబడులు పెంచుతూ, పర్యావరణ హానిని తగ్గించే దిశగా దేశం చిత్తశుద్ధితో పనిచేస్తోంది.
ఈ విజయం పట్ల అంతర్జాతీయ వేదికలపై భారత్కు ప్రశంసలు లభించే అవకాశముండగా, 2047 నాటికి పూర్తిస్థాయిలో పర్యావరణపరంగా స్వచ్ఛమైన భారతదేశం లక్ష్యానికి ఇది ఒక పెద్ద ముందడుగు కానుంది.
