Hebah Patel: టాలీవుడ్లో కొన్ని పాత్రలు నటులను ఓవర్‌నైట్ స్టార్లుగా మార్చేస్తాయి. అదే బాటలో తన అందం, అభినయంతో తొలిసారి స్క్రీన్‌పై మెరిసిన నటి హెబ్బా పటేల్. ‘అలా ఎలా’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, వెంటనే ‘కుమారి 21F’ చిత్రంతో స్టార్ హీరోయిన్గా మారింది. సుకుమార్ రైటింగ్స్ పై తెరకెక్కిన ఆ సినిమా హెబ్బాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
Hebah Patel: అయితే ఆ గ్లోరీ ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తర్వాత చేసిన సినిమాల్లో కొన్ని మాత్రమే ప్రేక్షకులను మెప్పించగలిగాయి. మొత్తం 12 సినిమాల్లో నటించిన హెబ్బాకు నాలుగు మాత్రమే హిట్స్‌గా నిలిచాయి. అవకాశాలు తగ్గాక స్పెషల్ సాంగ్స్, గ్లామర్ షోలు చేసినా… ఆమె కెరీర్ మళ్లీ పుంజుకోలేకపోయింది.

వినూత్నమైన పాత్రలు లేక, వరుసగా వస్తున్న ఫ్లాప్‌లతో హెబ్బా కొంత వెనక్కి పడిపోయింది.

అయినా కూడా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు.ప్రత్యేకంగా సోషల్ మీడియాలో ఆమెకి ఉన్న క్రేజ్ అలాంటిది కాదు.

గ్లామరస్ ఫోటోలు, ఫన్నీ రీల్స్‌తో కుర్రకారుకు డోస్ పెడుతుంటుంది. ఆమె సోషల్ మీడియా హ్యాండిల్స్ పర్యటనగా చూస్తే అసలు స్క్రీన్ మిస్ అయినా, అందాల విందు మాత్రం ఎప్పటికప్పుడు కనిపిస్తుంది.

ఇటీవల ఓటిటీలో విడుదలైన ఓదెల 2 సినిమాలో నటించిన హెబ్బా, తన పాత్రతో మళ్లీ ఒక ఆశను రేకెత్తించింది. నటనకు అవకాశం ఉన్న మంచి కథలు దొరికితే మరోసారి టర్నింగ్ పాయింట్ రాబోతోందని అభిమానులు ఆశిస్తున్నారు. అవకాశాలు తగ్గినా, తన స్టైల్, ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల మదిలో ఓ స్థానం సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
