War2 Movie Collections: బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న వార్2..రెండో రోజు ఎంత వచ్చాయంటే!

War2 Movie Collections: స్పై యూనివర్స్ సినిమాలకు ఎప్పటికీ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలకైనా తెగించే రా ఏజెంట్ల కథలు ప్రేక్షకుల హృదయాలను తాకుతాయి. అదే నాడిని పట్టుకుని యష్ రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కించిన తాజా చిత్రం వార్ 2. ఈసారి స్పెషల్ ఏమిటంటే.. మన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్‌లో అడుగుపెట్టగా, మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అందుకే రిలీజ్‌కు ముందు నుంచే సినిమాపై భారీ బజ్ నెలకొంది.

War2 Movie Collections: అంచనాలకు తగ్గట్టుగానే సినిమా విడుదలైన తర్వాత కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మొదటి రోజే రికార్డ్ స్థాయిలో రూ. 52 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, రెండో రోజు కలెక్షన్లను మరింతగా పెంచుకుంది.

రెండో రోజు “వార్ 2” కలెక్షన్లు రూ. 56.35 కోట్లు. దీంతో రెండు రోజుల్లో మొత్తం రూ. 108.35 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. “కూలీ”తో పోటీగా విడుదలైనప్పటికీ, వార్ 2 కలెక్షన్లు బలంగా కొనసాగుతుండటం విశేషం. వరుసగా సెలవులు రావడంతో థియేటర్లకు ప్రేక్షకులు క్యూలు కడుతున్నారు.

ప్రేక్షకుల అభిప్రాయాల ప్రకారం, సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టారని చెబుతున్నారు. “విక్రమ్ వర్సెస్ కబీర్” ఎపిసోడ్‌ అయితే హాలీవుడ్ స్థాయి రేంజ్‌లో ఉందని ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. డైరెక్టర్ హాలీవుడ్‌ టచ్‌ ఇచ్చిన స్టంట్స్, విజువల్స్ సినిమాను మరింత గ్రాండియర్‌గా మార్చాయి.

మొత్తంగా, వార్ 2 బాక్సాఫీస్ వద్ద శరవేగంగా దూసుకుపోతోంది. రానున్న రోజుల్లో కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *