Horrific Incident: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన ఒక్కసారిగా భయాందోళనకు గురిచేసింది. పక్కింట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై ఓ 47 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు రావడంతో, స్థానికంగా కలకలం రేగింది. బాధిత బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న వేళ, ఆమె పక్కింట్లో నివసిస్తున్న కరుణాకర్ బెహెరా అనే వ్యక్తి ఆ ఇంట్లోకి చొరబడి ఈ ఘోరానికి పాల్పడ్డాడు అని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అమానుష చర్య జూలై 20న జరిగినప్పటికీ, బాలిక రెండురోజులపాటు నిశ్శబ్దంగా భయంతో గడిపింది. చివరకు కన్నీళ్ల మధ్య తన తల్లిదండ్రులకు జరిగిన దురాగతం గురించి చెప్పడంతో ఇది వెలుగులోకి వచ్చింది.
Horrific Incident: ఈ సంఘటనపై తీవ్ర స్థాయిలో స్పందించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించగా, అమర్దా రోడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసారు. భారతీయ న్యాయసంహితలోని సెక్షన్లు అలానే లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల కస్టడీలో విచారణలో ఉన్నాడు. చిన్నారులపై ఇటువంటి నరరూప రాక్షసత్వానికి పాల్పడే వారికి శిక్ష తప్పదని అధికారులు చెబుతున్నారు.
Horrific Incident: ఇటువంటి ఘటనలు సమాజంలో ఎటువంటి మానసిక స్థితిలో ఉన్న వారు చిన్నారులపై కామదృష్టి సారిస్తున్నారో స్పష్టంగా తెలియజేస్తున్నాయి.బాలిక కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఒంటరిగా ఉన్నదని భావించి, తన ఆకృత్యాన్ని చూపించిన వ్యక్తి—సమాజంలోని మానవతా విలువలపై ప్రశ్నలు తలెత్తించేలా చేస్తోంది. మానవత్వాన్ని మరిచి ప్రవర్తించే కొంతమంది కామాంధుల వల్ల నేటి చిన్నారుల భద్రతకే ముప్పుగా మారింది.
Horrific Incident: ఈ ఘటనపై స్పందించిన స్థానికులు, నిందితుడికి కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు. పోక్సో చట్టాన్ని మరింత దృఢంగా అమలు చేయాలని, ఇలాంటి కేసుల్లో వేగంగా విచారణ జరిగి న్యాయం తక్షణమే జరిగేలా చూడాలని కోరుతున్నారు. బాలికలపై జరిగే దారుణాలను అరికట్టాలంటే, తల్లిదండ్రులు, సమాజం, ప్రభుత్వ యంత్రాంగం కలసి చైతన్యంతో ముందడుగు వేయాల్సిన సమయం ఆసన్నమైంది.
