Cyber Attack: సైబర్ దాడులతో దేశానికి భారీ నష్టం.. నెలకు ₹1000 కోట్ల స్వాహా!

Cyber Fraud

Cyber Attack: డిజిటల్ యుగంలో టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదో, అదే వేగంతో సైబర్ నేరగాళ్ల బెడద కూడా పెరుగుతున్నది. 2025లో తొలి ఐదు నెలల్లో భారత్‌పై సైబర్ దాడులు తీవ్రమయ్యాయని, దీంతో దేశం దాదాపు ₹7 వేల కోట్ల ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంది. కేంద్ర హోంశాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ నష్టం ప్రధానంగా ఆగ్నేయ ఆసియా దేశాల నుంచి జరిగిన సైబర్ మోసాల వల్లనే ఏర్పడిందని చెబుతోంది.

Cyber Attack: మయన్మార్, కంబోడియా, వియత్నాం, లావోస్‌, థాయిలాండ్‌ వంటి దేశాల్లోని సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌లు భారతీయులపై టార్గెట్ చేస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా, ఫేక్ లింకులు, ఫిషింగ్ మెసేజెస్, వాహనాల కొనుగోలు విక్రయాల పేరుతో నమ్మకద్రోహం జరుగుతోంది. పోలీస్ శాఖ అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినా, నిత్యం మారుతున్న మోసపూరిత పద్ధతుల నుంచి ప్రజలను రక్షించడం కష్టమే అవుతోంది.

ఇది కూడా చదవండి: Job Notification: నిరుద్యోగులకు శుభవార్త.. అటవీశాఖలో భారీగా ఉద్యోగాలు.. వివరాలివే..

Cyber Attack: అంతేకాకుండా, ఈ ముఠాలు భారతీయులను ఏజెంట్లుగా నియమించుకుంటున్నాయన్నదే ఇక ఓ షాకింగ్ విషయంగా నిలుస్తోంది. లావోస్‌, మయన్మార్ వంటి దేశాల్లో ఇండియన్లు సైబర్ నెట్‌వర్క్‌ల కోసం పనిచేస్తున్నారని కేంద్ర సంస్థలు గుర్తించాయి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వస్తుందన్న ఆశతో యువత ఈ నేరాలకు పాల్పడుతున్నదని సమాచారం.

Cyber Attack: ఈ మోసాల తీవ్రతను అంచనా వేసుకుంటే, ప్రతి నెలా దేశం సుమారు ₹1,000 కోట్ల మేర నష్టాన్ని చవిచూస్తోంది. ఇది దేశ ఆర్థిక స్థిరత్వానికి తీవ్రమైన ముప్పుగా మారింది. ప్రజల వ్యక్తిగత డేటా, బ్యాంకింగ్ సమాచారాన్ని చోరీ చేయడం ద్వారా ఈ నేరగాళ్లు లక్షల రూపాయల్ని కొల్లగొడుతున్నారు.

Cyber Attack: ఈ నేపథ్యంలో ప్రజలు తమ డిజిటల్ భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకుండా, గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చిన కాల్స్‌కి స్పందించకుండా, OTP, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోకుండా జాగ్రత్త వహించాలి. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ, డిజిటల్ ప్రపంచంలో అప్రమత్తంగా ఉండే సంస్కృతి పెంపొందించుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *