Job Notification: ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వ నియామక ప్రక్రియలో భాగంగా ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తాజాగా ఒక నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీనివల్ల అటవీశాఖలో మొత్తం 691 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) పదవులకు 256 ఖాళీలు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) ఉద్యోగాలకు 435 ఖాళీలు ఉన్నాయి. ఈ నియామక ప్రక్రియ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మధ్యతరగతి యువతకు మంచి అవకాశం.
ఉద్యోగ ఖాళీలు – పోస్టుల వివరాలు:
| పోస్టు పేరు | ఖాళీలు |
| ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) | 256 |
| అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) | 435 |
| మొత్తం | 691 |
Job Notification: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యగా నిర్ణయించారు. అయితే, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియలో స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ రాత పరీక్ష, ఫిసికల్ మెజర్మెంట్ టెస్ట్ (PMT), వాకింగ్ టెస్ట్ ఉంటాయి. అన్ని దశల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులే తుది ఎంపికకు నోచుకుంటారు.
ఇది కూడా చదవండి: Ramayanam Movie: రామాయణం షూటింగ్ పూర్తి! రణబీర్ – సాయి పల్లవి సినిమా ఎప్పుడు వస్తుందో తెలుసా?
Job Notification: వేతన పరంగా చూస్తే, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు నెలకు రూ. 25,220 నుండి రూ. 80,910 వరకు జీతం లభించనుంది. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు రూ. 20,000 నుండి రూ. 70,000 వరకు జీతం ఉండనుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తారు. జూలై 16, 2025 నుండి ఆన్లైన్ దరఖాస్తు లింక్ అందుబాటులోకి రానుంది. దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 5, 2025 (రాత్రి 11:59 వరకు). అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in ను సందర్శించి పూర్తి నోటిఫికేషన్ చదవాలి, ఆపై దరఖాస్తు పూర్తి చేయాలి.
ఈ ఉద్యోగాలు ప్రకృతి సంరక్షణ, అడవుల రక్షణ వంటి బాధ్యతలతో కూడినవి కావడంతో, పర్యావరణంపై ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా నిలవనుంది. నిర్దిష్ట పరీక్షలు, శారీరక పరీక్షలు ఉన్నందున ముందుగానే ప్రిపరేషన్ మొదలుపెట్టడం ఉత్తమం. ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆశించే యువతీ, యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ కెరీర్ను ప్రభుత్వ రంగంలో స్థిరపరచుకోవచ్చు.
