OG Movie First Review: ఓజీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. థియేటర్లు దద్దరిల్లిపోతాయ్!

OG Movie First Review: ఇక్కడ వినండి :  

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత హైప్ తో విడుదలకు సిద్ధం అయిన మూవీ ఓజీ. టైటిల్ ఎనౌన్స్ చేసినపుడు మొదలైన ఓజీ హంగామా షూటింగ్ ఆలస్యం అయినా.. రిలీజ్ వాయిదాలు పడినా.. ఏమాత్రం తగ్గలేదు. పైగా రిలీజ్ కు దగ్గర పడే కొద్దీ ఒక మేనియాలా మారిపోయింది. ఓజీ పవన్ ఫాన్స్ మంత్రంగా మారిపోయింది. పవన్ రాజకీయ సమావేశాల్లో పాల్గొన్నా.. అక్కడ ఓజీ నినాదాలు వినిపిస్తూ వచ్చాయి. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఓజీ మూవీకి ఎంత బజ్ ఉందొ. దాదాపు రెండు నెలల క్రితం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ ఫాన్స్ ను నిరాశపరిచింది. అయినా.. అందరూ కూడా ఓజీ ఉంది. మామూలుగా ఉండదు అంటూ సోషల్ మీడియాలో హోరెత్తించారు. 

OG Movie First Review: ఇదిగో సరిగ్గా ఈరోజు రాత్రికి ఓజీ ప్రీమియర్ షోలు పడుతున్నాయి. ఇప్పటికే మూవీకి సెన్సార్ ఏ సర్టిఫికెట్ వచ్చింది. అయినా మూవీ ప్రీమియర్ బుకింగ్స్ జోరు ఏమాత్రం తగ్గలేదు. తెలంగాణలో 800 రూపాయలు.. ఆంధ్రప్రదేశ్ లో 1000 రూపాయలు పెట్టి టికెట్టు కొనడానికి ఎవరూ వెనుకాడలేదు. ఇంకా కొన్ని చోట్ల టికెట్ల వేలంపాట కూడా జరిగింది. లక్షల రూపాయలకు ఒక టికెట్ ను పాడుకున్న అభిమానులు ఉన్నారు. మరి కొద్దీ గంటల్లో మూవీ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. ఈలోగా సెన్సార్ రివ్యూ అంటూ ప్రతి సినిమా విడుదలకు కొద్దీ గంటల ముందు రివ్యూలు ఇచ్చే ఉమైర్ సంధు తన రివ్యూతో ఓజీ మూవీపై మరింత క్రేజ్ పెంచేశారు. 

OG Movie First Review: ఓజీ సినిమా గురించి ఆయన చేసిన ట్వీట్ ఫాన్స్ కె కాదు మొత్తం సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకుల్లో హీట్ పుట్టించింది. 2025లో వచ్చిన పవర్ ప్యాక్డ్.. బ్లడీ మాస్ బెస్ట్ థ్రిల్లర్ అని ఒక్క మాటలో మూవీని పైకి లేపేశారు సంధు. ఇది పవన్ సాలిడ్ కమ్ బ్యాక్ అని చెప్పిన సంధు.. విలన్ గా చేసిన ఇమ్రాన్ హాష్మిని పొగడ్తలతో ముంచేశాడు. అలాగే క్రేజీ డైలాగులు.. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అంటూ సుజిత్ ను ఒక రేంజిలో అభినందనలతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఓజీ పైసా వసూల్ సినిమా అని చెబుతున్న ఆమిర్ సందు మూవీ క్లైమాక్స్ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అని ఫాన్స్ కి కిక్కిచ్చే రివ్యూ ఇచ్చేశాడు. మొత్తంగా మూవీకి 3.5 రేటింగ్ ఉమైర్ సంధు ఇవ్వడంతో ఫాన్స్ ఖుషేగా ఉన్నారు. నిముషాలు యుగాల్లా లెక్కపెడుతూ రాత్రి పది ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నారు. మీరుకూడా ఓజీ మూవీ కోసం ఎదురుచూస్తున్నారా? మీరేమనుకుంటున్నారు.. కామెంట్స్ లో చెప్పండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *