Bomb Threats: తమిళనాడులో మళ్లీ బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. గురువారం (అక్టోబర్ 2) సాయంత్రం నుంచి సీఎం ఎంకే స్టాలిన్ నివాసం, హీరోయిన్ త్రిషా ఇల్లు, బీజేపీ రాష్ట్ర కార్యాలయం, రాజ్భవన్ వంటి పలు ముఖ్య ప్రదేశాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో చెన్నైలో భద్రతా పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తం అయ్యాయి.
Bomb Threats: బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు వెంటనే బాంబు డిటెక్షన్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దించారు. అన్ని ప్రదేశాల్లో విస్తృత తనిఖీలు జరిపారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు కనుగొనలేదని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Dulquer Salmaan: దుల్కర్ సినిమాలో హీరోయిన్గా క్రేజీ బ్యూటీకి బంపర్ ఆఫర్!
స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ చెన్నై సెనోటాఫ్ రోడ్ ప్రాంతంలో నివసిస్తోంది. ఆమె ఇల్లు, సీఎం స్టాలిన్ నివాసం ఉన్న చిత్తరంజన్ రోడ్ సమీపంలోనే ఉంది. దీంతో ఈ బెదిరింపులు రాజకీయ, సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తూ జరిగాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
జులై 27న కూడా సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో పెద్ద కలకలం రేపింది. అయితే ఆ కేసులో ఆకతాయిలే ఉన్నారని తేలింది. ఇప్పుడు మళ్లీ ఇలాంటి ఘటన జరగడంతో చెన్నై పోలీసులు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేశారు.
తమిళనాడు ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. నిందితులను గుర్తించి పట్టుకోవడానికి సైబర్ క్రైమ్ టీమ్ను రంగంలోకి దించింది. త్వరలోనే ఈ బెదిరింపుల వెనుక ఉన్న అసలు కారణాలు వెలుగులోకి రానున్నాయి.
