Dulquer Salmaan: స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇటీవలే విడుదలైన లక్కీ భాస్కర్ సినిమాతో భారీ విజయాన్ని సాధించాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియాలో సూపర్ డూపర్ హిట్ అయింది.
Dulquer Salmaan: 2012లో సెకండ్ షో సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన దుల్కర్, ఉస్తాద్ హోటల్ వంటి సినిమాలతో అభిమానుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. తెలుగులో ఒకే బంగారంతో ఎంట్రీ ఇచ్చి మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత చేసిన సినిమాలూ టాలీవుడ్లో మంచి ఆదరణ పొందాయి.
ఇది కూడా చదవండి: Bigg Boss Captaincy: కెప్టెన్సీ కంటెండర్స్గా కళ్యాణ్, ఇమ్మానుయేల్ – కొత్త టీమ్లతో టాస్క్ ప్రారంభం!
ఇప్పుడు మళ్లీ ఒక తెలుగు దర్శకుడితో దుల్కర్ పని చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. పవన్ సాదినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ కొత్త చిత్రానికి “ఆకాశంలో ఓ తార” అనే టైటిల్ను ఖరారు చేసినట్లు సమాచారం.
ఈ సినిమాలో హీరోయిన్గా రుహానీ శర్మ నటించనుందని ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్గా మారింది. చిలసౌ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన రుహానీ, తన తొలి సినిమాతోనే తెలుగు యువత హృదయాలను దోచుకుంది. కానీ ఆ తర్వాత పెద్దగా క్రేజ్ రాకపోవడంతో ఇండస్ట్రీలో కొద్దికొద్దిగా సినిమాలు చేస్తూ కొనసాగుతోంది.
ఇప్పుడు దుల్కర్ సినిమాలో అవకాశం రావడం ఆమె కెరీర్కి పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని అభిమానులు అంటున్నారు. ఈ వార్తల్లో నిజం ఉంటే రుహానీ శర్మ రేంజ్ పూర్తిగా మారిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
View this post on Instagram
