Sana Mir: ఆజాద్ కాశ్మీర్ వ్యాఖ్యతో రచ్చ – పాక్ కామెంటేటర్‌పై లైఫ్ టైం బ్యాన్ డిమాండ్?

Sana Mir: మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. రాబోయే ఆదివారం భారత్ – పాకిస్తాన్ మధ్య జరగనున్న కీలక మ్యాచ్‌కి ముందే పాక్ మాజీ కెప్టెన్ సనా మీర్ ఒక వ్యాఖ్యతో దుమారం రేపింది.

Sana Mir: గురువారం కొలంబో ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన బంగ్లాదేశ్ – పాకిస్తాన్ మ్యాచ్లో కామెంటరీ చేస్తూ సనా మీర్, పాకిస్తాన్ ఆటగాడు నటాలియా పర్వేజ్ గురించి మాట్లాడుతూ ఆమె “ఆజాద్ కాశ్మీర్‌ నుండి వచ్చిందని” చెప్పడం పెద్ద వివాదానికి దారితీసింది.

ఇది కూడా చదవండి: Mohsin Naqvi: ACC సమావేశంలో తలవంచిన నఖ్వీ.. కానీ ట్రోఫీపై మొండి వైఖరి..!

అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను PoK అని పిలుస్తారు. దానిని రాజకీయంగా పాక్ “ఆజాద్ కాశ్మీర్” అని వ్యవహరిస్తుంది. ఇలాంటి పదజాలం క్రీడల్లో వాడకూడదనే ఐసీసీ కఠిన నిబంధనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సనా మీర్ వ్యాఖ్యను “రాజకీయ ప్రోపగాండా”గా పరిగణిస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సోషల్ మీడియాలో ఆగ్రహం

నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ –

  • క్రీడా వేదికపై రాజకీయ వ్యాఖ్యలు చేయడం తప్పు అన్నారు. 
  • ఆమెను వెంటనే కామెంటరీ ప్యానెల్‌ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. 
  • కొందరు అయితే సనా మీర్‌పై లైఫ్‌టైమ్ బాన్ విధించాలని కూడా కోరుతున్నారు. 

సనా మీర్ వ్యాఖ్యలపై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇదే సమయంలో, అక్టోబర్ 5న జరగనున్న భారత్-పాకిస్తాన్ మహిళల ప్రపంచ కప్ మ్యాచ్పై ఈ వివాదం ప్రభావం చూపే అవకాశముంది. ముఖ్యంగా, టాస్ సమయంలో హర్మన్‌ప్రీత్ కౌర్ పాక్ కెప్టెన్‌తో హ్యాండ్‌షేక్ చేస్తుందా లేదా? అన్న అంశం చర్చనీయాంశమైంది.

ఇప్పటికే పురుషుల ఆసియా కప్‌లో హ్యాండ్‌షేక్, ట్రోఫీ వివాదాలు రగులుకున్నాయి. ఇప్పుడు మహిళల ప్రపంచ కప్‌లోనూ రాజకీయ వాదనలు చెలరేగడం, మ్యాచ్‌కి మరింత ఉత్కంఠను తెచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *