AC Offers: జీఎస్టీ తగ్గింపుతో వినియోగదారులకు భారీ రిలీఫ్ అందబోతోంది. సెప్టెంబర్ 22 నుంచి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా ఎయిర్ కండీషనర్లపై (AC) వేల రూపాయల తగ్గింపు అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో తయారీదారులు, డీలర్లు ముందస్తు ఆఫర్లు, ప్రీ బుకింగ్లను ప్రకటించారు. కేవలం రూపాయికే ఏసీ బుకింగ్ అవకాశాన్ని కొన్ని కంపెనీలు కల్పించాయి.
AC Offers: ప్రస్తుతం ఏసీలపై 28 శాతం జీఎస్టీ అమలులో ఉంది. కానీ సెప్టెంబర్ 22 నుంచి ఇది 18 శాతానికి తగ్గనుంది. ఈ తగ్గింపుతో ఒక్కో ఏసీపై రూ.4,000 వరకు ధరలు తగ్గుతాయని అంచనా. బ్లూ స్టార్, హైయర్ వంటి కంపెనీలు ఈ ప్రయోజనాన్ని నేరుగా కస్టమర్లకు అందిస్తామని ప్రకటించాయి.
ఇది కూడా చదవండి: APSRTC Jobs 2025: ఎలాంటి రాత పరీక్షలేకుండా ఉద్యోగాలు, నోటిఫికేషన్ విడుదల!
హైయర్ కంపెనీ కేవలం రూ.1 చెల్లించి ఏసీ ప్రీ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అదనంగా ఎంపిక చేసిన చెల్లింపులపై 10% క్యాష్బ్యాక్, ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీలకు ఉచిత ఇన్స్టాలేషన్, గ్యాస్ ఛార్జింగ్తో ఐదేళ్ల వారంటీ, జీరో కాస్ట్ ఈఎంఐ వంటి ప్రయోజనాలు అందిస్తున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 10 నుంచి 21 వరకు ఈ బుకింగ్ విండో అందుబాటులో ఉంటుంది.
హైయర్ తమ 1.6 టన్నుల 5 స్టార్ ఏసీ ధరను రూ.3,905, 1.0 టన్నుల 3 స్టార్ ఏసీ ధరను రూ.2,577 తగ్గించింది. దీంతో వినియోగదారులు తక్కువ ధరకే బ్రాండెడ్ ఏసీలను పొందే అవకాశం లభిస్తోంది.
జూన్ త్రైమాసికంలో అకాల వర్షాల కారణంగా ఏసీ అమ్మకాలు తగ్గాయి. ఇప్పుడు ధర తగ్గింపు, సులభమైన ఫైనాన్స్ ఆప్షన్లు, ఉచిత ఇన్స్టాలేషన్, పొడిగించిన వారంటీ వంటి ఆఫర్లతో కంపెనీలు మళ్లీ అమ్మకాల ఊపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాయి.
బ్లూ స్టార్ మేనేజింగ్ డైరెక్టర్ త్యాగరాజన్ మాట్లాడుతూ.. “కస్టమర్ల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి రాగానే బిల్లులు జారీ చేస్తాం” అని తెలిపారు. పరిశ్రమ వర్గాలు ఈ తగ్గింపుతో ఏసీ మార్కెట్ మళ్లీ చురుకుదనాన్ని సంతరించుకుంటుందని నమ్ముతున్నాయి.
