Myntra: విదేశీ పెట్టుబడుల్లో మింత్రా మోసం..? ఈడీ సీరియస్ కేసు నమోదు!

Myntra

Myntra: ఈ కామర్స్ రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న మింత్రా ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకుంది. ప్రధానంగా ఫ్యాషన్ రంగానికి చెందిన ఈ ప్లాట్‌ఫారమ్‌ ప్రస్తుతం అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లకు గట్టి పోటిగా నిలుస్తోంది. కానీ తాజాగా మింత్రాపై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) నమోదు చేసిన కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Myntra: ఈడీ ఆరోపణల ప్రకారం, మింత్రా ఫెమా (FEMA – విదేశీ మారకద్రవ్యాల నిర్వహణ చట్టం) నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది. రూ.1,654.35 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) వాణిజ్య పరంగా తప్పుగా ఉపయోగించిందని, అవి హోల్‌సేల్ వ్యాపార పేరిట రావడం, కానీ వాటిని మల్టీ బ్రాండ్ రిటైలింగ్‌కు వాడినట్లు తేలిందని పేర్కొంది.

Myntra: ఈ కేసును బెంగళూరు జోనల్ కార్యాలయం ఆధారంగా నమోదు చేసినట్లు ఈడీ తెలిపింది. దర్యాప్తులో తేలిందేమంటే, మింత్రా హోల్‌సేల్ వ్యాపార మోడల్ ద్వారా విదేశీ పెట్టుబడిని పొందినట్లు చూపించి, అసలు తన అనుబంధ సంస్థ అయిన వెక్టర్ ఈ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి ఆ ఉత్పత్తులన్నింటినీ విక్రయించింది. వెక్టర్ మాత్రం నేరుగా కస్టమర్లకు వాటిని విక్రయించినట్లు ఆధారాలు లభించాయని ఈడీ పేర్కొంది.

ఇది కూడా చదవండి: Mobile Production in India: నాలుగేళ్లలో మొబైల్ ఉత్పత్తుల్లో విప్లవాత్మక పెరుగుదల.. కేంద్ర మంత్రి గోయల్ వెల్లడి

Myntra: ఫెమా చట్టం ప్రకారం, హోల్‌సేల్ వ్యాపారం చేసే కంపెనీలు తమ అనుబంధ సంస్థలకు అత్యధికంగా 25 శాతం వరకే ఉత్పత్తులు విక్రయించగలవు. కానీ మింత్రా మాత్రం తాను విక్రయించిన 100 శాతం ఉత్పత్తులను వెక్టర్‌కి అమ్మింది. ఇదే ప్రధానంగా చట్ట ఉల్లంఘనకు కారణమైంది.

Myntra: మింత్రా, వెక్టర్ రెండు సంస్థలు ఒకే గ్రూప్‌కు చెందినవే కావడంతో, ఇది నిబంధనల దారుణంగా అపవాదమైన చర్యగా మారింది. మరోవైపు, హోల్‌సేల్ వ్యాపార సంస్థలు నేరుగా వినియోగదారులకు ఉత్పత్తులను విక్రయించరాదు. అవి రిటైలర్లకు లేదా ఇతర వ్యాపార సంస్థలకు మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. కానీ ఈ వ్యవస్థను మింత్రా కూల్చేసిందన్నదే ఈడీ అభిప్రాయం.

Myntra: ప్రస్తుతం ఈ వ్యవహారంపై మింత్రా ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే ఈ కేసు ఇప్పుడు కంపెనీకి, అలాగే ఈ కామర్స్ రంగానికీ ఒక మేజర్ అలెర్ట్‌గా మారింది. ఫెమా నిబంధనలు, విదేశీ పెట్టుబడుల వినియోగంలో పారదర్శకత, నియమాలను కచ్చితంగా పాటించడం ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *