NPCI Update: డిజిటల్ లావాదేవీలను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు, వేగవంతం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎంపిక చేసిన వ్యాపారి వర్గాలకు 24 గంటల్లో రూ.10 లక్షల వరకు UPI లావాదేవీలు చేసే అవకాశం కల్పించింది.
NPCI Update: ఈ సౌకర్యం మూలధన మార్కెట్ పెట్టుబడులు, బీమా ప్రీమియం చెల్లింపులు, క్రెడిట్ కార్డ్ బిల్లులు, లోన్ EMIలు, ప్రభుత్వ చెల్లింపులు, పన్ను చెల్లింపులు, ప్రయాణ సేవలు వంటి వర్గాలకు వర్తిస్తుంది. అయితే వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P) బదిలీల పరిమితి రోజుకు రూ.1 లక్షగానే కొనసాగుతుంది.
ఈ కొత్త పరిమితి 2025 సెప్టెంబర్ 15 నుండి అమల్లోకి రానుంది. ముఖ్యంగా ఆదాయపు పన్ను రిటర్నులు, ఇతర ప్రభుత్వ చెల్లింపుల చివరి తేదీలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు NPCI వెల్లడించింది. NPCI నిర్ణయం ప్రకారం, ప్రతి బ్యాంకు తమ భద్రతా ప్రమాణాలు, విధానాలకు అనుగుణంగా అంతర్గత లావాదేవీ పరిమితులను నిర్ణయించుకోవచ్చు. అయితే గరిష్టంగా 24 గంటల్లో రూ.10 లక్షలను మించకూడదు.
ఇది కూడా చదవండి: Jio Hotstar: రూ.100 కే 90 రోజుల పాటు బిగ్ బాస్ & బ్లాక్బస్టర్ ఎంటర్టైన్మెంట్!
కీలక UPI పరిమితి మార్పులు
- క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లింపులు – లావాదేవీకి ₹5 లక్షలు, రోజువారీ పరిమితి ₹6 లక్షలు
- లోన్ & EMI చెల్లింపులు – లావాదేవీకి ₹5 లక్షలు, రోజువారీ పరిమితి ₹10 లక్షలు
- మూలధన మార్కెట్ & బీమా ప్రీమియం – లావాదేవీకి ₹5 లక్షలు, రోజువారీ పరిమితి ₹10 లక్షలు
- ప్రయాణ చెల్లింపులు – లావాదేవీకి ₹5 లక్షలు
- ప్రభుత్వ GeM & పన్ను చెల్లింపులు – లావాదేవీకి ₹5 లక్షలు (మునుపటి పరిమితి ₹1 లక్ష మాత్రమే)
- బ్యాంకింగ్ సేవలు (టర్మ్ డిపాజిట్లు) – రోజుకు ₹5 లక్షలు (మునుపటి పరిమితి ₹2 లక్షలు)
- విదేశీ మారకం (BBPS ద్వారా) – లావాదేవీకి ₹5 లక్షలు, రోజువారీ పరిమితి ₹5 లక్షలు
ఈ మార్పు వల్ల పన్నులు, బీమా, పెట్టుబడులు, EMI వంటి అధిక విలువ గల చెల్లింపులు సులభతరం అవుతాయి. వినియోగదారులు ఇకపై పదేపదే చిన్న మొత్తాల లావాదేవీలు చేయాల్సిన అవసరం ఉండదు. డిజిటల్ ఇండియా దిశగా మరో ముందడుగుగా ఈ నిర్ణయం భావిస్తున్నారు.
