Mobile Production in India: భారతదేశం ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్ తయారీలో విశేష పురోగతి సాధించిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పీఎల్ఐ (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్) పథకం, జాతీయ పారిశ్రామిక కారిడార్ వంటి కార్యక్రమాల వల్ల దేశీయ తయారీ రంగం గణనీయంగా అభివృద్ధి చెందిందని వాణిజ్య ఇంకా పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ రాజ్యసభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు.
Mobile Production in India: మొబైల్ ఫోన్ల ఉత్పత్తి విలువ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,13,773 కోట్లుగా ఉండగా, 2024-25 నాటికి ఇది దాదాపు 146 శాతం పెరిగి రూ.5,25,000 కోట్లుకు చేరిందని గోయల్ పేర్కొన్నారు. ఇదే కాలంలో మొబైల్ ఫోన్ల ఎగుమతులు మరింత శక్తివంతంగా ఎదిగి, 2020-21లో ఉన్న రూ.22,870 కోట్లు నుండి 2024-25 నాటికి రూ.2,00,000 కోట్లుకి పెరిగాయని వెల్లడించారు. ఇది దాదాపు 775 శాతం వృద్ధి కావడం గమనార్హం.
Mobile Production in India: ఈ వృద్ధికి ప్రధాన కారణంగా ప్రభుత్వం అమలు చేసిన పీఎల్ఐ పథకాలు నిలిచాయని మంత్రి తెలిపారు. ఈ పథకం కంపెనీలకు తయారీపై ఆధారపడిన ప్రోత్సాహకాలను అందించడంతో పాటు, విదేశీ మరియు దేశీయ సంస్థలు తమ ఉత్పత్తి యూనిట్లను స్థాపించడానికి ప్రోత్సహించబడ్డాయి. దీని ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగాయి, దిగుమతులపై ఆధారపడే అవసరం తగ్గింది.
ఇది కూడా చదవండి: IND vs ENG 4th Test: ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో కీలక మ్యాచ్.. భారత్ టాస్ ఓడి.. కొత్త బుమ్రా అరంగేట్రం
Mobile Production in India: ఈ కార్యక్రమాల వలన భారత్ ఇప్పుడు ప్రపంచపు ప్రధాన మొబైల్ ఫోన్ తయారీ కేంద్రాల్లో ఒకటిగా ఎదిగిందని గోయల్ స్పష్టం చేశారు. మొబైల్ తయారీతోపాటు, పీఎల్ఐ పథకం ద్వారా ఫార్మా రంగంలో ముడి పదార్థాల దిగుమతులు తగ్గినట్లు కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లోనే పెన్సిలిన్-జి సహా పలు కీలక బల్క్ ఔషధాల తయారీ జరుగుతోందని చెప్పారు.
Mobile Production in India: అంతేకాకుండా, వైట్ గూడ్స్ తయారీపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఎయిర్ కండిషనర్లు, ఎల్ఈడీ లైట్లు వంటి ఉత్పత్తుల కోసం బలమైన కాంపోనెంట్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా భారత్‌ను గ్లోబల్ సప్లై చైన్లలో భాగంగా మార్చే లక్ష్యంతో పలు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి: Gautam Gambhir: గంభీర్ కొత్త ప్రయత్నం నెట్స్‌లో త్రోడౌన్ చేయడం నేర్చుకుంటున్న టీమిండియా కోచ్!
ఇతర కార్యక్రమాల దృష్ట్యా, కేంద్రం మేక్ ఇన్ ఇండియా 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది 27 కీలక రంగాలను లక్ష్యంగా పెట్టుకుని వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలవుతోంది. తయారీ పెట్టుబడులకు అనుకూలంగా ఉండేందుకు జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం కొనసాగుతోంది.
నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NICDP) కింద రూ. 28,602 కోట్ల వ్యయంతో 12 కొత్త ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని మంత్రి తెలిపారు. అటు ‘ఆత్మనిర్భర్ భారత్’ ప్యాకేజీలతో పాటు నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్, ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్, పార్క్ రేటింగ్ సిస్టమ్, నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ వంటి చర్యల ద్వారా పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరుస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
