LPG Cylinder: సెప్టెంబర్ 22 తర్వాత LPG సిలిండర్ ధరలు తగ్గుతాయా?

LPG Cylinder: దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ రేట్లు సెప్టెంబర్ 22 నుండి అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఆహారం, పానీయాలు, రోజువారీ వినియోగ వస్తువుల ధరలు తగ్గే అవకాశముందని ఇప్పటికే అనేక కంపెనీలు ప్రకటించాయి. రాబోయే రోజుల్లో మరిన్ని సంస్థలు కూడా తమ ఉత్పత్తుల ధరలు తగ్గించేందుకు ముందుకు రావొచ్చని భావిస్తున్నారు.

LPG Cylinder: ఇక వినియోగదారులలో మరో పెద్ద సందేహం – LPG సిలిండర్ల ధరలు కూడా తగ్గుతాయా? ప్రస్తుతం గృహ వంట గ్యాస్ సిలిండర్లపై 5% జీఎస్టీ, వాణిజ్య సిలిండర్లపై 18% జీఎస్టీ అమలులో ఉంది. అయితే తాజా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో గ్యాస్ సిలిండర్లపై ఎటువంటి మార్పు ప్రకటించలేదు.

ఇది కూడా చదవండి: Viral Video: వంటగదిలో JCB యంత్రం.. వైరల్ వీడియో చూసి షాక్ అయిన నెటిజన్లు!

అంటే, సెప్టెంబర్ 22 తర్వాత కూడా గృహ LPG సిలిండర్ల ధరల్లో ఎలాంటి తగ్గింపు ఉండదు. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల గృహ LPG సిలిండర్ ధర రూ.853 గా ఉంది.

మరోవైపు, వాణిజ్య LPG సిలిండర్ల విషయానికి వస్తే – హోటళ్ళు, తినుబండారాలు, రెస్టారెంట్లు, పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించే ఈ సిలిండర్లపై ప్రస్తుతం ఉన్న 18% GST రేటు కొనసాగనుంది. దాంతో, సెప్టెంబర్ 22 తర్వాత కూడా ధరల్లో ఎటువంటి మార్పు ఉండదు. ప్రస్తుతం ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ.1580 గా ఉంది.

దీనితో, జీఎస్టీ మార్పుల వల్ల వినియోగ వస్తువుల ధరల్లో ఊరట లభించినా, గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం మార్పు ఉండకపోవడం వినియోగదారులకు నిరాశ కలిగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *