Viral Video: కారు సీట్ బెల్ట్‌తో ఇంటి తలుపుకు తాళం.. జుగాద్ టాలెంట్ చూసి షాక్ అయిన నెటిజన్లు!

Viral Video: ప్రస్తుతం ఏం నడుస్తోంది బ్రో..? అంటే – “అంతా డిజిటల్.. విత్ AI..” అంటోంది ఆధునిక యువత. కానీ ఈ టెక్నాలజీ యుగంలో కూడా ఎప్పటికీ మాయం కాని ఒక ప్రతిభ ఉంది – అదే జుగాద్ టాలెంట్! మన దగ్గర సమస్య వస్తే, దానికి లోకల్ సొల్యూషన్ ఇచ్చే సృజనాత్మకత ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి ఒక జుగాద్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: ఈ వీడియోలో ఒక వ్యక్తి కారు సీట్ బెల్ట్ లాకింగ్ సిస్టమ్‌తో ఇంటి తలుపుకు తాళం తయారు చేశాడు. సాధారణంగా సీట్ బెల్టులు వాహన భద్రత కోసం ఉపయోగిస్తారు. కానీ అతను ఆ పాత భాగాన్ని రీసైకిల్ చేసి, తలుపుకు అమర్చాడు. సీట్ బెల్ట్ బకిల్‌ను తలుపు ఒక వైపు, క్లిప్‌ను గోడపై అమర్చడంతో తలుపు మూసిన వెంటనే లాక్ అయిపోయింది. తలుపు తెరవడానికి, కారులో లాగే ఒక క్లిక్‌తో అన్‌లాక్ చేయాలి.

ఇది కూడా చదవండి: Viral Video: వంటగదిలో JCB యంత్రం.. వైరల్ వీడియో చూసి షాక్ అయిన నెటిజన్లు!

మొదటి చూపులో ఈ ట్రిక్ సింపుల్‌గా అనిపించినా, నిజానికి ఇది చాలా వినూత్నమైన ఆలోచన. ఖరీదైన తాళాలు కొనకుండా, పాత భాగాన్ని ఉపయోగకరంగా మార్చడం అతని ప్రత్యేకత.

వీడియో బయటకు రాగానే నెటిజన్లు ఆశ్చర్యపోయారు. కొందరు “దొంగ తలుపు తెరవాలంటే ముందు సీట్ బెల్ట్ విప్పడం నేర్చుకోవాలి” అంటూ కామెంట్లు చేయగా, మరికొందరు లోకల్ టాలెంట్ అంటే ఇదే అని ప్రశంసించారు. ఇంకొందరు పదునైన ఆలోచన ఉంటే పాత వస్తువుకూ కొత్త ప్రాణం పోస్తుందని రాశారు.

కొద్దిసేపట్లోనే వైరల్ అయిన ఈ వీడియో, మరోసారి భారత జుగాద్ టాలెంట్ క్రియేటివిటీని ప్రపంచానికి చూపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *