Handshake Controversy: పాక్ నాటకం బహిర్గతం.. అసలు బాధ్యత ఎవరిదో బయటపడింది!

Handshake Controversy: ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం చోటుచేసుకున్న హ్యాండ్‌షేక్ వివాదం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు జట్ల ఆటగాళ్లు ఒకరితో ఒకరు చేతులు కలపకపోవడంతో పాక్ మీడియా, పీసీబీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Handshake Controversy: ఈ ఘటన తర్వాత పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) ఐసీసీకి ఫిర్యాదు చేస్తూ, మ్యాచ్ రిఫరీ అండీ పైక్రాఫ్ట్ టాస్ సమయంలో ఆచారాలను పాటించలేదని ఆరోపించింది. అయితే, తాజా మీడియా నివేదికల ప్రకారం, పైక్రాఫ్ట్ ఎటువంటి తప్పూ చేయలేదని, ఆయన ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఇచ్చిన ఆదేశాలను మాత్రమే అనుసరించారని తేలింది.

ఇది కూడా చదవండి: Viral Video: వైరల్ వీడియో కోడి దాడి.. కుక్క రక్షణ.. నెటిజన్లకు ఫుల్ ఎంటర్టైన్‌మెంట్!

ముఖ్యంగా, టాస్ సమయంలో ఆటగాళ్లు చేతులు కలపకూడదన్న ఆదేశాలు ఏసీసీ నుంచే వచ్చాయని, దానిని పైక్రాఫ్ట్ అమలు చేశారని ఐసీసీ స్పష్టంచేసింది. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఏసీసీ అధ్యక్షుడిగానే పీసీబీ చీఫ్ మొహసిన్ నఖ్వీ ఉన్నారు. అంటే ఈ నిర్ణయం వెనుక నేరుగా పీసీబీకే బాధ్యత వస్తుంది.

ఐసీసీ ఈ వివాదంపై వెంటనే స్పందించి, పైక్రాఫ్ట్‌ను ప్రశంసిస్తూ ఆయన టీవీలో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి రాకుండా చూసుకున్నారని పేర్కొంది. దీంతో పీసీబీ చేసిన ఆరోపణలు తప్పుబట్టబడ్డాయి. అయినప్పటికీ, పీసీబీ మరోసారి మెయిల్ చేస్తూ, ఆసియా కప్ నుంచి తప్పుకుంటామని బెదిరించింది. అయితే ఐసీసీ తన నిర్ణయంపై కట్టుబడి ఉందని, కేవలం ఒక జట్టు ఒత్తిడితో అధికారులను మార్చలేమని స్పష్టం చేసింది.

ఇక సెప్టెంబర్ 17న యూఏఈ-పాకిస్తాన్ మ్యాచ్ ముందు పాక్ జట్టు ఆలస్యంగా మైదానానికి చేరడం వల్ల మరోసారి వివాదం తలెత్తింది. ఈ సమస్యను పరిష్కరించడానికి పైక్రాఫ్ట్ స్వయంగా చర్చలకు దిగారు. ఆ సమావేశం తర్వాత బయటకు వచ్చిన వీడియోలో ఎలాంటి ఆడియో లేకపోయినా, పీసీబీ మ్యాచ్ రిఫరీ క్షమాపణలు చెప్పారని ప్రచారం చేసింది. అయితే తాజా నివేదికలు పైక్రాఫ్ట్ ఎటువంటి క్షమాపణలు చెప్పలేదని, పాక్ ఆరోపణలు పూర్తిగా తప్పుడు అని తేల్చేశాయి.

ఈ పరిణామాలతో పీసీబీ నడిపిన హ్యాండ్‌షేక్ వివాదం పూర్తిగా బూమరాంగ్ అయ్యింది. నెటిజన్లు, క్రికెట్ అభిమానులు దీనిపై పాక్ వైఖరిని తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *