Pakistan: పాకిస్థాన్ రాజకీయ నాయకుడు బిలావల్ భుట్టో, భారత్ సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసిన నేపథ్యంలో యుద్ధ బెదిరింపులు జారీ చేశాడు. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఈ చర్యపై ఆయన తీవ్రంగా స్పందించాడు. భారత ప్రభుత్వ నిర్ణయం పాకిస్థాన్కు భారీ నష్టం కలిగిస్తుందని, యుద్ధం తప్ప మరో మార్గం లేదని భుట్టో హెచ్చరించాడు.
Pakistan: పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి భుట్టో, ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావిస్తూ ఇండియాపై విమర్శలు గుప్పించాడు. పహల్గామ్ దాడి తర్వాత దశాబ్దాల నాటి సింధు జల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం పాకిస్థాన్పై దురాక్రమణ చర్య అని పేర్కొన్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలకు వ్యతిరేకంగా అన్ని పాకిస్తానీలు ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చాడు.
ఇది కూడా చదవండి: Bank Account: జీరో నుంచి రూ.50 వేల వరకు.. మినిమం బ్యాలెన్స్ పెంపు వివాదం!
Pakistan: సింధ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, సింధు జల ఒప్పందాన్ని భారత్ ఇలాగే కొనసాగించకపోతే, పాకిస్థాన్ యుద్ధాన్ని పరిగణనలోకి తీసుకోవడం తప్ప మార్గం ఉండదని ఆయన స్పష్టం చేశాడు. “మీరు (పాకిస్తానీలు) ఆరు నదులను తిరిగి పొందేంత బలంగా ఉన్నారు. మన జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు యుద్ధం సహా అన్ని మార్గాలను పరిశీలించాలి” అని భుట్టో పేర్కొన్నాడు.
తాను యుద్ధాన్ని ప్రారంభించాలనే ఉద్దేశ్యం లేదని చెబుతూ, “కానీ మీరు సిందూర్ లాంటి దాడి గురించి ఆలోచిస్తే, పాకిస్తాన్లోని ప్రతి ప్రావిన్స్ ప్రజలు మీతో పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మీరు ఓడిపోయే యుద్ధం అవుతుంది” అని హెచ్చరించాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అణు యుద్ధం గురించి హెచ్చరించిన మరుసటి రోజే భుట్టో ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
