Sanju Samson: టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ సంజు శాంసన్ కెరీర్ ఎప్పుడూ ఒడిదుడుకులతో సాగుతోంది. జట్టులో కొన్నిసార్లు చోటు సంపాదించుకున్నా, మళ్లీ బయటకు వెళ్ళాల్సి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ తన బ్యాటింగ్ ప్రతిభతో తిరిగి టీమిండియాలో స్థానం సంపాదించాడు. అయితే ఒక రికార్డు మాత్రం సంజుకి ‘శాపం’గా మారింది. ఆసియా కప్‌లో దీని విషయంలో అతను జాగ్రత్తగా ఉండాల్సిందే.
Sanju Samson: భారతదేశం తరపున టీ20 క్రికెట్లో అత్యధికంగా డకౌట్ అయ్యిన బ్యాట్స్మన్ల జాబితాలో సంజు శాంసన్ కూడా చేరాడు. ఇప్పటివరకు అతను 42 టీ20 మ్యాచ్‌లు ఆడి 6 సార్లు డకౌట్ అయ్యాడు. అంటే తక్కువ మ్యాచ్‌ల్లోనే అతను ఈ జాబితాలో అగ్రస్థానానికి దగ్గరగా చేరుకున్నాడు.
ఈ సిగ్గుచేటు రికార్డులో మొదటి స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. 159 టీ20 మ్యాచ్‌ల్లో 12 సార్లు డకౌట్ అయ్యాడు. రెండో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. 125 టీ20 మ్యాచ్‌ల్లో 7 సార్లు డకౌట్ అయ్యాడు. ఇప్పుడు శాంసన్ కేవలం రెండు సార్లు డకౌట్ అయితేనే కోహ్లీని దాటేసి రెండో స్థానంలోకి వస్తాడు.
ఇక ఆసియా కప్ ప్రారంభానికి ముందు శాంసన్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. కేరళ క్రికెట్ లీగ్‌లో ఓపెనర్‌గా ఆడుతూ ఒక సెంచరీతో పాటు నాలుగు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి మొదలవుతుంది. ప్లేయింగ్ XIలో శాంసన్ ఖాయం అనిపిస్తున్నా, అతను ఏ నంబర్లో బ్యాటింగ్‌కి వస్తాడన్నదే అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.
ఆ ఒక్క తప్పిదం వలన సంజు శాంసన్ కూడా రోహిత్, కోహ్లీ తరహాలో చెత్త రికార్డులోకి ఎంట్రీ ఇస్తాడా? లేక తన ఫామ్‌ను కొనసాగించి ఆసియా కప్‌లో సత్తా చాటుతాడా? అన్నది చూడాలి.
