Mylavaram: మైలవరంలో దారుణం.. ప్రేమలో పడ్డ 14 ఏళ్ల కూతురిని రాడ్డుతో చంపిన తండ్రి!

Mylavaram: ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో పసిపాపను చంపిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. తండ్రి చేతిలోనే 14 ఏళ్ల మైనర్ బాలిక గాయత్రి ప్రాణాలు కోల్పోయింది. ప్రేమ వ్యవహారంలో ఉందని తెలుసుకున్న తండ్రి తన స్వంత కూతురినే రాడ్డుతో కొట్టి హతమార్చి, అనంతరం మృతదేహాన్ని అడవిలో పడేశాడు.

Mylavaram: నిందితుడు చిందే బాజీ (46) ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి భార్య నాగమ్మతో ఐదుగురు ఆడపిల్లలు పుట్టగా, రెండో భార్య నాగేంద్రమ్మ నుంచి గాయత్రి జన్మించింది. అయితే రెండవ భార్యను వదిలేయడంతో, ఆమె కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. బాజీ మాత్రం తన వద్ద ఉన్న ఆరుగురు ఆడపిల్లల పోషణ కోసం గంజాయి విక్రయం మొదలుపెట్టాడు.

ఈ అక్రమ వ్యాపారంలో బాజీ, నాగేంద్రమ్మ జైలుకెళ్లారు. ప్రస్తుతం నాగేంద్రమ్మ ఇంకా జైలులో ఉండగా, బాజీ ఇటీవలే బయటకు వచ్చాడు.

ఇది కూడా చదవండి: Chitfund Scam: ఘరానా చీటీ మోసం కోట్లతో వ్యాపారి పరారైపోగా.. బాధితుల గగ్గోలు

జైలు నుంచి వచ్చిన బాజీ తన కూతురు గాయత్రి ఒక యువకుడితో ప్రేమలో ఉందని గమనించాడు. దీనిపై ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. కానీ గాయత్రి మాట వినకపోవడంతో, ఇంట్లోనే తన ఐదుగురు కుమార్తెల సమక్షంలోనే ఆమెపై ఐరన్ రాడ్‌తో దాడి చేశాడు. విచక్షణారహితంగా కొట్టడంతో గాయత్రి అక్కడికక్కడే మృతి చెందింది.

హత్య అనంతరం బాజీ తన కూతురి మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేశాడు. ఈ ఘటన బయటపడకూడదని భావించి జాడలను చెరిపివేయడానికి ప్రయత్నించాడు. అయితే, గాయత్రి కనిపించకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఐదు రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు, గమనించిన సీసీ కెమెరా ఫుటేజీలు, డ్రోన్ల సహాయంతో అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు తండ్రి చేసిన దారుణం బట్టబయలైంది. ప్రస్తుతం బాజీని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *