Kukatpally: హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసు ఎట్టకేలకు పోలీసుల దర్యాప్తుతో పరిష్కారమైంది. రేణు హత్యకు పాల్పడిన నిందితులను రాంచీ, ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారం పోలీసులకు కీలక ఆధారంగా మారింది.
Kukatpally: సాన్వీ లేక్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న రాకేష్ అగర్వాల్, రేణు దంపతుల కుటుంబం ఈ సంఘటనతో విషాదంలో మునిగిపోయింది. రాకేష్కు సనత్నగర్లో స్టీల్ షాప్ ఉండగా, ఆయన పని కోసం బయటకు వెళ్లిన రోజే ఈ దారుణం జరిగింది. భార్య రేణు ఇంట్లో ఒంటరిగా ఉండగా హర్ష, రోషన్ అనే ఇద్దరు పనిమనుషులు ఆమెపై దాడి చేశారు.
ఇది కూడా చదవండి: Crime News: ఒంటరి మహిళలే టార్గెట్.. ఈ భార్యాభర్తల యవ్వారం తెలిస్తే కళ్లు తేలేస్తారు..!
రేణు చేతులు, కాళ్లు కట్టి కుక్కర్తో తలకు బలంగా కొట్టి, కత్తితో దాదాపు 20 సార్లు పొడిచి హత్య చేశారు. ఆమె కేకలు వేయకుండా గొంతులో కత్తెరతో పొడిచినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు. అనంతరం నిందితులు ఇంట్లో ఉన్న ఐదు తులాల బంగారం, రూ.50 వేల నగదుతో పరారయ్యారు. రక్తంతో తడిసిన దుస్తులను అక్కడే వదిలి స్నానం చేసి స్కూటీపై తప్పించుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీ చూపించింది.
హత్య అనంతరం నిందితుడు హర్ష రాంచీకి పారిపోవడానికి కొండాపూర్ నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఈ ప్రయాణంలో క్యాబ్ డ్రైవర్ అనుమానం పడి ఇన్స్టాగ్రామ్లో పరిశీలించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆ కీలక ఆధారంతో పోలీసులు నిఖిల్ను ఢిల్లీలో, హర్ష–రోషన్లను రాంచీలో పట్టుకున్నారు.
ఈ కేసు చేధనతో రేణు కుటుంబానికి న్యాయం జరిగిందని పోలీసులు తెలిపారు. అదే సమయంలో అనుమానాస్పద వ్యక్తులపై జాగ్రత్త వహించాలని హెచ్చరించారు.
