Hyderabad: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో షాక్..యువతి వద్ద 3.1 కిలోల గంజాయి పట్టుబాటు

Hyderabad: హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం భారీ డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. బ్యాంకాక్ నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ఓ యువతి అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో అధికారులు ఆమెను చెక్ చేయగా, షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

Hyderabad: 23 ఏళ్ల ఈ యువతి బ్యాగులో 3.1 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి దొరికింది. ఈ మాదక ద్రవ్యాలను నాలుగు ప్యాకెట్లలో బిగించి దాచిపెట్టినట్లు అధికారులు గుర్తించారు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ.3 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Crime: దారుణం బాలుడికి బలవంతంగా బీర్ తాగించిన యువకులు..తరువాత!

ఇండిగో విమానం 6E-1068 ద్వారా బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ యువతి, ఎయిర్‌పోర్ట్‌లో తింగరిగా ప్రవర్తించడంతో భద్రతా సిబ్బంది అనుమానించారు. వెంటనే ఆమెను ఆపి, లగేజ్ తనిఖీ చేయగా గంజాయి బయటపడింది.

ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితురాలు గతంలో కూడా ఇలాంటి రవాణాకు పాల్పడిందా? లేదా దీని వెనక పెద్ద డ్రగ్స్ నెట్‌వర్క్ ఉందా? అనే కోణాల్లో విచారణ జరుగుతోంది.

ఈ ఘటనతో ఎయిర్‌పోర్ట్ భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది. డ్రగ్స్ స్మగ్లింగ్‌పై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *