Maharashtra: మహారాష్ట్రలో దారుణం: చికెన్ అడిగినందుకే తల్లి చేతిలో బాలుడి దారుణ మృతి!

Maharashtra: తల్లి ప్రేమను మించింది ఈ లోకంలో ఏదీ లేదని అంటారు. కానీ మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన ఈ మాటను తలదన్నేలా చేసింది. చికెన్ తినాలని కోరిన ఏడేళ్ల బాలుడిని తల్లి రోలింగ్ పిన్‌తో కొట్టి చంపేసింది.

Maharashtra: ఈ హృదయ విదారక సంఘటన పాల్ఘర్ జిల్లాలోని కాశీపాడ ప్రాంతంలో జరిగింది. 40 ఏళ్ల పల్లవి ధుమ్డే తన కుటుంబంతో అక్కడ నివసిస్తోంది.

ఇది కూడా చదవండి: Viral Video: కుక్కపిల్లను తన బిడ్డగా భావించిన కోతి.. తల్లికుక్కతో కలసి వీధికుక్కల ఆరాటం

ఆమె కుమారుడు చిన్మయ్ గణేష్ ధుమ్డే (7) చికెన్ తినాలని కోరాడు. ఈ చిన్న కోరికకే తల్లి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయి, రోలింగ్ పిన్‌తో విచక్షణారహితంగా కొట్టింది. తీవ్ర గాయాలతో చిన్మయ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

అంతటితో ఆగకుండా, పల్లవి తన 10 ఏళ్ల కూతురుపై కూడా దాడి చేసింది. ఆ బాలిక తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం సమీప ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

బాలిక అరుపులు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పల్లవి ధుమ్డేను అదుపులోకి తీసుకున్నారు.

పాల్ఘర్ ఎస్పీ యతీష్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ: “40 ఏళ్ల పల్లవి ధుమ్డే తన కొడుకును రోలింగ్ పిన్‌తో దారుణంగా కొట్టి చంపింది. ఆమె తన 10 ఏళ్ల కూతురినీ కొట్టింది. పాల్ఘర్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగుతోంది.” అని తెలిపారు.

ఈ ఘటన స్థానికులను తీవ్ర విషాదంలో ముంచేసింది. “చికెన్ అడిగినందుకు అమాయక బాలుడి ప్రాణం పోవడం నమ్మశక్యం కాని విషయం” అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *