Indonesia: ఇస్లామిక్ పాఠశాల కూలిపోవడంతో పెను ప్రమాదం – శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థులు!

Indonesia: ఇండోనేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు జావా ప్రావిన్స్‌లోని అల్ ఖోజిని ఇస్లామిక్ పాఠశాల భవనం అకస్మాత్తుగా కూలిపోవడంతో భారీ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఒకరు మృతి చెందగా, సుమారు 80 మంది గాయపడ్డారు.

Indonesia: ప్రమాదం జరిగిన సమయంలో పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్మికులు, స్థానికులు ఉన్నారు. శిథిలాల కింద 65 మంది చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. రెస్క్యూ బృందాలు ఇప్పటివరకు 102 మందిని సురక్షితంగా బయటకు తీశాయి.

ఇది కూడా చదవండి: Viral Video: కుక్కపిల్లను తన బిడ్డగా భావించిన కోతి.. తల్లికుక్కతో కలసి వీధికుక్కల ఆరాటం

పాఠశాల భవనంలో పునరుద్ధరణ పనులు జరుగుతుండగా, ఒక భాగం అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో విద్యార్థులు, కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు.

గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. రాత్రంతా తవ్వకాలు జరిపిన రెస్క్యూ సిబ్బంది, పోలీసులు, సైనికులు శిధిలాల కింద నుండి ఎనిమిది మంది విద్యార్థులను సజీవంగా రక్షించారు.

భవనం కూలిన వార్త తెలిసిన వెంటనే విద్యార్థుల కుటుంబాలు ఆసుపత్రుల వద్ద, ప్రమాద స్థలంలో గుమికూడాయి. శిథిలాల కింద చిక్కుకున్న పిల్లల కోసం బంధువులు ఆత్రుతగా ఎదురు చూస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు.

అధికారుల ప్రకారం మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *