Crime News: ముంబై నగరంలోని పోవై ప్రాంతంలో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు 30 సంవత్సరాలుగా భార్య నుంచి దూరంగా ఉన్న రిటైర్డ్ ఎయిర్లైన్ ఉద్యోగి, అకస్మాత్తుగా ఆమె ఇంటికి వెళ్లి ఘోర హత్యకు పాల్పడ్డాడు.
Crime News: పోలీసుల సమాచారం ప్రకారం, రాజీవ్ చంద్రకాంత్, షాలిని దేవి (54) 1993లో వివాహం చేసుకున్నారు. కానీ కుటుంబ కలహాల కారణంగా 1995 నుంచే ఇద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. శనివారం (సెప్టెంబర్ 27) రాత్రి రాజీవ్, కొన్ని పత్రాలను సేకరించడానికి షాలిని నివాసానికి వెళ్లాడు. అక్కడ వాగ్వాదం చెలరేగి, రాజీవ్ దిండుతో భార్యను ఊపిరాడకుండా చేసి హతమార్చాడు.
ఇది కూడా చదవండి: Crime News: తండ్రి జోబులో డబ్బులు దొంగిలించిందని కూతురిని ఏకంగా..
నిందితుడు అక్కడి నుంచి పారిపోయే ముందు తన మొబైల్ ఫోన్, కారు కీలను వదిలిపెట్టాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఆధారాలతో పోలీసులు కొద్ది గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశారు.
పోలీసుల విచారణలో, ఈ జంట తరచూ గొడవపడేవారని తేలింది. వీరిద్దరి మధ్య ఆస్తి వివాదం కూడా ఉన్నట్లు గుర్తించారు. గతంలో కూడా రాజీవ్ తన భార్యపై దాడి చేసిన సంఘటనలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. విచారణలో రాజీవ్ తన నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం అతనిపై హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
