Chaitanyananda Saraswati: ఢిల్లీ వసంత్‌కుంజ్‌లో మరోసారి గురువు ముసుగులో దొంగబాబా దుష్ప్రవర్తన బట్టబయలైంది. శ్రీ శారద ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారధిపై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న ఈ దొంగబాబా కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Chaitanyananda Saraswati: కాషాయ వస్త్రాలు ధరించి గాడ్‌మెన్‌గా నటించిన ఈ 70 ఏళ్ల ముసలి, ఆశ్రమంలో చదువుతున్న విద్యార్థినులను “Come to my room” అంటూ మెసేజ్‌లు పంపుతూ వేధించేవాడని బాధితులు ఫిర్యాదు చేశారు. వాట్సాప్ ద్వారా ఫారిన్ ట్రిప్‌ల ఆఫర్లు ఇచ్చి, లొంగకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానంటూ బెదిరించేవాడని విద్యార్థినులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్‌లో డేటింగ్ యాప్ మోసం.. ఓయో రూమ్‌లో డాక్టర్‌పై దాడి, బ్లాక్మెయిల్!
గత 12 ఏళ్లుగా ఆశ్రమం మొత్తం చైతన్యానంద ఆధీనంలోనే ఉందని పోలీసులు వెల్లడించారు. అధ్యాపకులు, వార్డెన్స్ కూడా అతడి మాటకే లోబడాల్సి వచ్చేదని ఆరోపణలు ఉన్నాయి. వార్డెన్స్ సహకారంతో విద్యార్థినుల వివరాలు బాబాకు చేరేవి. ప్రతిరోజూ టార్గెట్ చేసిన బాలికలకు వ్యక్తిగతంగా మెసేజ్‌లు పంపి లైంగిక వేధింపులకు పాల్పడేవాడని సమాచారం.
ఇప్పటికే 17 మంది విద్యార్థినులు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకుముందు కూడా 2009, 2016లో చైతన్యానందపై మోసం, లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. అంతేకాక నకిలీ UN నంబర్ ప్లేట్ ఉన్న కారు కూడా వాడినట్లు పోలీసులు గుర్తించారు.
శారదా పీఠం ట్రస్ట్ ఇప్పటికే చైతన్యానందను డైరెక్టర్ పదవి నుంచి తప్పిస్తూ, అతనితో సంబంధాలను తెంచుకుంది. ఇప్పటివరకు అతడిపై 5 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. 32 మంది విద్యార్థినుల స్టేట్మెంట్లు రికార్డు చేసిన తర్వాత కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.
దొంగబాబా దుష్టకృత్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థినులు, వెంటనే అతడిని పట్టుకుని కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
